»   »  'గబ్బర్ సింగ్ 2' పై రేణు దేశాయి ఖండన

'గబ్బర్ సింగ్ 2' పై రేణు దేశాయి ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu
No Akira in Gabbar Singh 2!!!
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్,సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందనున్న 'గబ్బర్ సింగ్ 2' చిత్రం ఆలస్యమవుతున్న కొలిదీ రూమర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఆ చిత్రాన్ని రూమర్స్ లైవ్ లో ఉంచుతున్నప్పటికీ, ఒక్కోసారి రూమర్స్ చిరాకుపుట్టిస్తూంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా...ఈ చిత్రంలో నటిస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయమై రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ట్విట్టర్ లో ఈ విషయమై ఆవిడ రాసుకొచ్చారు.

రేణు ట్వీట్ చేస్తూ... , " అకిరా గబ్బర్ సింగ్ 2 లో నటించటం లేదు... ఇలాంటి విచిత్రమైన రూమర్స్ ఎవరు పుట్టిస్తున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది... ". అనే అర్దం వచ్చేలా ఆమె ట్వీట్ చేసారు. కొద్ది రోజుల నుంచి అకీరా నందన్ ని సినిమాలకు పరిచయం చేయాల్సింది గా పవన్ పై ఆమె ప్రెజర్ తీసుకు వస్తున్నట్లు, పవన్ వెంటనే స్పందించి గబ్బర్ సింగ్ 2 లో ఆఫర్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ట్వీట్ తో ఆమె ఖండించింది.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Akira is NOT acting in GS-2...really in awe of the crazy ppl who come up with such insane rumours.get a life guys...seriously😀</p>— renu desai (@renuudesai) <a href="https://twitter.com/renuudesai/statuses/467510571764445184">May 17, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ చిత్రం కొద్ది రోజుల క్రిందట లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ఎపి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్ధ వారు భారీ మొత్తం ఇచ్చి సినిమా ప్రారంభం కాకుముందే తీసేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో ఈరోస్ వారు మహేష్ బాబు చిత్రం 1 నేనొక్కడినే చిత్రం కి సమర్పకులుగా ఉన్నారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ద కపూర్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ మిగతా సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Renu Desai made tweets about Akira debut as rumour. She tweeted as, “Akira is NOT acting in GS-2...really in awe of the crazy ppl who come up with such insane rumours. get a life guys...seriously”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more