బాహుబలితో ప్రభాస్ క్రేజ్ నేషనల్ వైడ్ గా వ్యాపించింది. ప్రభాస్ నెక్స్ట్ మూవీ జాతీయ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. సాహో చిత్రపై ఇప్పటీకే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయి ఉన్నాయి.
Prabhas To Shoot At Burj Khalifa For 'Saaho's' Next Schedule
సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని యాక్షన్ భరితంగా రూపొందిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. తాజగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ప్రభాస్ ఈ చిత్రంలో కండల ప్రదర్సన ఉండదట. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఎక్కువగా షర్ట్ లేకుండా బాడీ ప్రదర్శించాడు.
అలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండవని అంటున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో గూఢచారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హిరోయిన్ గా నటిస్తోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.