»   » లాస్ట్ మినిట్ ట్విస్ట్: మహేష్ బాబు చేయటం లేదు

లాస్ట్ మినిట్ ట్విస్ట్: మహేష్ బాబు చేయటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు....నా చిత్రంలో గెస్ట్ గా చేయటం లేదు అంటున్నారు సుధీర్ బాబు. ఆయన తాజా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' లో మహేష్ గెస్ట్ గా ఓ కీలకమైన సన్నివేశంలో కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుధీర్ బాబు ఇలా వివరణ ఇచ్చారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ.... " మహేష్ మా చిత్రంలో గెస్ట్ గా చేస్తున్నారనే వార్త ను చాలా రోజులుగా వింటున్నాము. నిజానికి మొదట మేము అనుకున్నాం కానీ మరీ...పదిహేను సెకన్లు గెస్ట్ కోసం మహేష్ లాంటి పెద్ద స్టార్ ని తీసుకురావటం పద్దతి కాదనిపించింది అందుకే డ్రాప్ అయ్యాం " అన్నారు.


అయితే తమ చిత్రంలో నాగచైతన్య, రానా గెస్ట్ లుగా చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మంచు మనోజ్ కూడా గెస్ట్ గా చేయటానికి ఒప్పుకున్నారని, స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి మనోజ్ అని అన్నారు. నేను కాల్ చేసిన వెంటనే మనోజ్ ...అతిథి పాత్రలో కనిపించటానికి ఓకే అన్నారు.


No Cameo of Mahesh Babu in My Film

కానీ ...చంద్రమోహన్ గారికి హార్ట్ స్ట్రోక్ రావటంతో షూట్ కాన్సిల్ చేసుకున్నాం. ఈ రోజుల్లో ఫోన్ కాల్ చేస్తే బంధువులు కూడా పంక్షన్స్ కు రావటం లేదు. అలాంటిది ఒక్క ఫోన్ కాల్ చేస్తే మనోజ్ నా సినిమాలో నటించటానికి ఓకే అని ముందుకు వచ్చారని అన్నారు.


చిత్రం విషయానికి వస్తే...


సుధీర్‌బాబు హీరోగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నెల్లూరి బోస్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి రూపొందిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు'. స్వామిరారా చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నందిని కథానాయిక. సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి.


No Cameo of Mahesh Babu in My Film

నిర్మాత చక్రి మాట్లాడుతూ..... 12వ శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారుచేసిన అతి విలువైన సీతారాముల విగ్రహాలను దొంగిలించే ప్రయత్నం కొందరు చేస్తారు.
ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఎంతవరకు సఫలం అయ్యారు? అనే ఇతివృత్తంతో క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతున్న ఈ చిత్రంలో వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపారు.


చెడు చేసేవాడు ఆలోచించాలి కానీ మంచి చేసేవాడు చేసుకుంటూ పోవాలని నమ్మే హీరో దేవుడి అండతో చిన్న మోసాలుచేస్తూ గడిపేస్తుంటాడని, ఏ గోల్ లేని అతని జీవితంలోకి ఓ లక్ష్యం వచ్చిచేరితే అతడు ఏ విధంగా స్పందించాడు అనే కథాకథనంతో ఈ చిత్రం రూపొందిందని, ఈనెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.


అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.

English summary
Sudheer Babu said: "We have been hearing about them from so many days. Initially, We took thought about it but dropped the plans realising Mahesh Babu is too big a star to do a 15 sec cameo in my Mosagallaku Mosagadu movie".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu