For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇప్పటి సినిమాల్లో దీపావళి వెలుగులేవి?

  By Bojja Kumar
  |

  తెలుగువారికి ప్రముఖమైన పండుగల్లో దీపావళి ఒకటి. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి, మధ్యలో విజయదశమికి చిత్రపరిశ్రమలో సందడి కనిపించిన విధంగానే ఏడాది చివర్లో వచ్చే దీపావళికి సైతం కొత్త చిత్రాల హడావుడి ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాల కలక్షన్స్‌ బావుంటాయని వ్యాపార వర్గాలు భావిస్తాయి.

  దీపావళి కథాంశంగా తీసుకుని పలు చిత్రాలు వచ్చాయి. దీపావళి పేరుతోనే సినిమా వచ్చింది. చీకటివెలుగులు, ఇంటింట దీపావళి వంటి పేర్లతో చిత్రాలు వచ్చినా ఇవి సాంఘిక కథలతో తీసినవి. దీపావళి సందర్భాన్ని ప్రస్తావిస్తూ చాలా చిత్రాల్లో పాటలను తీశారు. దీపావళి రోజు రాత్రి బాణసంచా కాలుస్తూ, వెలుగులు విరజిమ్మడం సంప్రదాయంగా వస్తోంది కాబట్టి పాటల్లో ఇలాంటి హడావుడి ఎక్కువగా కనిపించేది.

  అయితే ఇప్పటి పరిస్థితులు కొంత మేరకు మారాయని చెప్పవచ్చు. కొత్తగా సినిమాలు తీస్తున్న యువదర్శకులు సంప్రదాయాలు, పండుగలు వంటి అంశాలనే విస్మరిస్తున్నారనే విమర్శలున్నాయి. సినిమా తెలుగుదే అయినప్పటికీ వాటిలో పాశ్చత్యపోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్‌ పేరుతో, ఆధునికత పేరుతో వెగటు పుట్టించే సన్నివేశాలను చేర్చుతున్నారు. చాలావరకు సినిమాల్లో పండుగల ప్రస్తావన కనిపించడం లేదనే చెప్పవచ్చు. సంప్రదాయానికి, సంస్కృతికి వారధిగా ఉండాల్సిన కళాకారులు ఆ విషయాన్నే విస్మరిస్తున్నారు.

  నిజానికి అమావాస్యనాడు వచ్చే దీపావళి తెలుగువారికంటే తమిళులకు చాలా ఇష్టమైన పండుగ. తమిళంలో మనకు సంక్రాంతిలాగా, దీపావళికి విడుదల చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. తమిళ దీపావళి సినిమాల ఫలితాలపై తెలుగు చిత్రాల నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు.

  'హాయ్... ఉమాదేవి... హ్యాపీ దీపావళి" అంటూ శివాజీ (రజనీకాంత్) వచ్చేస్తాడు. అతన్ని చూడగానే కంగారుగా ఉమాదేవి (శ్రీయ) లోపలకి పరుగెత్తి ....'అమ్మా... వచ్చేసారే!" అంటుంది. దాంతో ఆమె తల్లి 'వెళ్లి ఆ తలుపెయ్యవే!" అని పురమాయిస్తుంది. 'అలాగలాగే..." అంటూ శ్రీయ వెళ్లి తలుపు వేద్దామని పరుగెత్తుకెళ్ళేసరికి అక్కడ ఆల్రెడి శివాజి, అతని తల్లి, తండ్రి, ఫ్రెండ్ కూర్చుని 'హాయ్" అని పలకరిస్తారు. అదిచూసి ... 'అమ్మా... అమ్మా... వాళ్ళు లోపలకి వచ్చేసారే" అంటూ మళ్ళీ అరుస్తుంది. ఇంతలోకి ఉమాదేవి తండ్రి వచ్చి... వీళ్లని చూసి..."" ఆ రోజే మీకూ మాకూ రాం రాం అని చెప్పాం కదా.... ఇలా చీటికి మాటికీ వచ్చి ఎందకయ్యా విసిగిస్తారు"" అంటారు. దాంతో శివాజి...' అందరం కలిసి దీపావళి పండుగ చేసుకుని గారె, నాటు కోడి పులుసు తిని పరిచయం పెంచుకుందామ"ని వచ్చానంటాడు. అయినా ఆయన వినక వీళ్లను బయటకు గెంటేస్తాడు. అప్పుడు ఎదురింటి ముసలాయన వచ్చి ''నాకు ఇద్దరు కూతుళ్లున్నారు.... నా ఇంటిలో దీపావళి జరుపుకుని... నా కూతుళ్లతో పరిచయం పెంచుకోండి"" అంటూ ఆఫర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ''శివాజీ" చిత్రం చూసిన మనకందరకి తెలిసిందే.

  నిజానికి 'దీపావళి... తెలుగు సినిమా" ఎంతసేపు ఆలోచించినా ఈ సీనే గుర్తుకు వస్తోంది. మంచి సీనేగా ప్రాబ్లం ఏంటీ అంటే అది 'తమిళ డబ్బింగ్ సినిమా" కదా. కాస్త మన తెలుగు సినిమాలో సీన్‌జ్ఞాపకం వస్తే ఎంత బాగుండును అని బాధేస్తుంది. అలా గుర్తుకు రాకపోవటానికి కారణం మన తెలుగు సినిమాల్లో మన తెలుగు పండుగలకు సంబంధించిన సన్నివేశాలు ఈ మధ్యన పెట్టకపోవడమే!

  English summary
  Present telugu cinema is totally ignoring Deepavali importance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X