»   » నాతో ఏ మగాడు రానంటున్నాడు: ప్రీతీ జింతా

నాతో ఏ మగాడు రానంటున్నాడు: ప్రీతీ జింతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ సరసన రాజకుమారుడు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా చిత్రాల్లో కనపించిన ప్రీతీ జింతా ఆ తర్వాతతెలుగు తెరవైపు చూడలేదు. అలాగని ఆమె బాలీవుడ్ లోనూ బిజీగా లేదు. అయితే బిజీగా లేనప్పుడన్నా సరదాగా అలా గడిపి వద్దామంటే కుదురటం లేదంటోంది. అందులో ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడితే తనకూ వారికీ మధ్య మీడియా సంభందాలు అంటగడుతోందంటూ వాపోతోంది.

ఆ విషయమై ప్రీతి మాట్లాడుతూ...కో ఆర్టిస్టులతో గానీ, స్నేహితులతోగానీ బయటకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉంది. నా చుట్టూ ఎంతో మంది సెలబ్రెటీలు ఉంటారు. వారందరూ వారి పర్సనల్‌ లైఫ్‌ గురించి చర్చించుకుంటారు. అందరం ఎన్నో అంశాలను మాట్లాడుకుంటాం. అలా పబ్లిక్‌గా ఎవరి తోనైనా నేను క్లోజ్‌గా ఉంటే, వెంటనే వారికి నాకు మధ్య ఏవో సంబంధా లున్నాయని అంటగడుతున్నారు. దీంతో వారు నాతో పాటు కలిసి బయటకు రావటం మానుకున్నారు. ఇదెంతో నాకు చికాకు కలిగిస్తోంది అంటోంది.

అలాగే షూటింగ్‌ లేనప్పుడు, విదేశాలకు వెళు తున్నాను అన్నా అపార్ధం చేసుకుని ఏవేవో రాసేస్తున్నారు. ముంబై అంటే నాకు ప్రాణం. షూటింగ్‌ లేనప్పుడు, ఒక యాక్టర్‌గా ఏం చేయాలి..పార్టీలకు వె ళ్లలేను. జాగింగ్‌ చేయలేను. కనీసం బయటకు కూడా వెళ్లలేను. ఏ వ్యక్తితో కలిసి బయటకు వెళ్లలేను. వెళితే, మరో స్త్రీని వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. అందుకే షూటింగ్‌ లేనప్పుడు విదేశాల్లో గడు పుతున్నాను. అంతేగాని నాకు ప్రేమలో విఫలమై నా పగిలిన హృదయాన్ని మాన్చుకోవడానికో, మరిదేని కోసమో ప్రయాణాలు చేయటం లేదు అని చెప్పుకొచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu