మూడో ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉండదు, జై లవకుశ లో చాలామెలికలున్నాయ్
జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు, దీన్లో ఉండే మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.
జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో లో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా ఈ మూడుపాత్రలతోనూ జతకట్టే ముగ్గురు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం ఈ నెల 15 నుంచి యూనిట్ తో జాయిన్ అవనున్నాడు. అప్పటివరకూ మిగతా వాళ్లతో ఉండే పార్ట్ తీస్తారట.
జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు అన్న సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.

నెగెటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు. ఇద్దరు హీరోలూ ఒక విల క్యారెక్టర్లు కావటంతో ఈ విలన్ పాత్రకి హీరోయిన్ లేదన్నమాట. ఈ సినిమాలోని మూడు పాత్రలకు సంబంధించి.. మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడట యంగ్ టైగర్. అందుకే తన బాడీని సరైన షేప్ లోకి మార్చుకునేందుకు తెగ వర్కవుట్స్ చేసేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











