»   » 'నో హోమ్ వర్క్...ఓన్లీ క్లాస్ వర్క్'...రవితేజ కామెంట్

'నో హోమ్ వర్క్...ఓన్లీ క్లాస్ వర్క్'...రవితేజ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజని మీరు తెరపై కొత్త రకంగా మ్యానరిజమ్స్ పలకించటానికి, స్పెషల్ డైలాగ్ డెలవరి కి ఏమన్నా హోమ్ వర్క్ చేస్తారా అని అడిగితే...రవితేజ వెంటనే...నో హోమ్ వర్క్...ఓన్లీ క్లాస్ వర్క్ అని రిటార్ట్ ఇచ్చారు. అలాగే తాను సెట్ పైన ఇప్రవైజేషన్స్ కు ప్రయారిటీ ఇస్తానని అన్నాడు. అంతేగాక తనకు అవార్డులు వంటివాటిపై పెద్ద నమ్మకాలు ఆసక్తి లేవని, కేవలం ప్రేక్షకల స్పందనే తనకు ఆస్కార్ వచ్చినంత సంబరం కలిగిస్తుందని అన్నాడు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న వీర చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్‌లో రమేష్‌వర్మ దర్శకత్వంలో గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న 'వీర" చిత్రం మే 20 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్స్ ధియోటర్స్ లో రిలీజ్ చేసారు. అలాగే క్రిందటి వారం విడుదల చేసిన పాటలు మంచి టాక్ తెచ్చుకున్నాయి.

అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన 'డ్రైవర్ రాముడు"లోని 'మామిళ్ల తోట కాడ పండిస్తే..."పాటను ఈ 'వీర"చిత్రం కోసం రీమిక్స్ చేశారు. సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని తెలియచేస్తూ...మామూలుగా రీమిక్స్ పాటలకు దూరంగా ఉండే నేను ఈ చిత్రం కోసం 'డ్రైవర్ రాముడు"లోని 'మామిళ్ల తోట కాడ పండిస్తే..." అనే పాటను రీమిక్స్ చేశాను. సందర్భానుసారం ఈ పాట సాగుతుంది. ఇది మంచి ఫీల్ ఉన్న చిత్రం. ఈ ఆడియో, సినిమా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది అన్నారు.అలాగే ఈ చిత్రంలో కాజల్...కబడ్డి చిట్టిగా అలరించనుంది. మంచి మాస్ ఎంటర్టైనర్ అని దర్శకుడు రమేష్ వర్మ భరోసా ఇస్తున్నాడు.

English summary
Ask Ravi Teja if he does any homework for his roles, he retorts, "No homework only class work, I believe in improvisations on the sets." He also doesn't believe in any awards but a heartfelt compliment matters to him a lot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu