twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగైచతన్య డైలాగు పై నెగిటివ్ కామెంట్స్

    By Srikanya
    |

    బెజవాడ నాదిరా... ముట్టుకుంటే పగిలిపోద్ది.. బెజవాడ సినిమాలో నాగచైతన్య చెప్పే డైలాగ్ ఇది. దీన్నే ప్రోమోలలో రిలీజ్ చేసారు. అయితే ఈ డైలాగు విన్నవారంతా నాగచైతన్య చెప్తూంటే కృత్రిమంగా చెప్తున్నట్లు ఉంది కానీ ఎమోషన్ ఫీలవతున్నట్లు లేదంటున్నారు. అందులోనూ దడ సినిమా ప్లాప్ కావటంతో ఈ యాక్షన్ సినిమాపైనా అనుమానాలు రేగుతున్నాయి. మరో ప్రక్క తెలుగులో అప్పలరాజు,దొంగలముఠా చిత్రాల తో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రవేసించి డిజాస్టర్స్ ఇచ్చిన వర్మ ఈ చిత్రానికి టైటిల్ హంగామాతో పబ్లిసిటీ క్రియోట్ చేయటం చూసిన వారికి మరింత అనుమానాలు కలుగుతున్నాయి. వివేక్‌కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ... కోనేరు కిరణ్‌కుమార్‌తో కలిసి రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    సమకాలీన సమాజానికి అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని రామ్‌గోపాల్‌వర్మ చెబుతున్నారు.నాన్న తో పరిచయమైన అమలాపాల్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.ఈ చిత్రంని అక్టోబర్ 21న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ చిత్రం ఎనభైల్లోనూ, తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్,యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది. నాగచైతన్య 'బెజవాడ రౌడీలు"గురించి మాట్లాడుతూ -''రామ్‌ గోపాల్‌ వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

    English summary
    News reports coming out are indicating the Bezawada maybe released on October 21st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X