»   » ఐశ్వర్యరాయ్, రణబీర్ మధ్య ముద్దు సీన్ ఉంది కానీ, తీసేసారు!

ఐశ్వర్యరాయ్, రణబీర్ మధ్య ముద్దు సీన్ ఉంది కానీ, తీసేసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క వర్మ ప్రధాన పాత్రల్లో ‘యే దిల్ హై ముష్కిల్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్టు ప్రకారం ఈ సినిమాలో రణబీర్, ఐశ్వర్యరాయ్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందట. అయితే ఐశ్వర్యరాయ్ ఇబ్బంది పడుతుందని, బచ్చన్ కుటుంబంతో మాటొస్తుందని దర్శకుడు ఆ సీన్ మార్చారట.

గతంలో ఐశ్వర్యరాయ్ ‘దూమ్-2' మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి కిస్సింగ్ సీన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే సినిమా విడుదల కావడంతో అప్పట్లో ఈ సీన్ పెద్ద దుమారమే రేపింది. బచ్చన్ ఫ్యామిలీ సినిమా నుండి ఆ సీన్ తీసేయించేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది.

No Kissing Scene between Aish and Ranbir

ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె కిస్సింగ్ సీన్లో నటించేందుక సిద్ధంగా లేదు. పైగా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో కరణ్ జోహార్ మంచి రిలేషన్ షిప్ మేయింటేన్ చేస్తున్నారు. ఇపుడు రణబీర్, ఐశ్వర్య లతో ముద్దు సీన్ చేయిస్తే అనవసర ఇబ్బంది వస్తుందని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడట కరణ్ జోహార్.

1977లో విడుదలైన ‘దూస్రా ఆద్మీ' చిత్రానికి రీమేక్ గా ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016 దివాళి నాటికి విడుదల చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ఆ చిత్ర టీం. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ లాంటి స్టార్ల ఉండటం వల్ల సినిమాకు మంచిరెస్పాన్స్ వస్తుందని దర్శకుడు కరణ్ జోహార్ భావిస్తున్నారు.

English summary
According to DNA website, the script of Karan Johar's next directorial project, Ae Dil Hai Mushkil, demanded is a kiss and a passionate scene between the leading man Ranbir Kapoor and Aishwarya Rai Bachchan. But No Kissing Scene between Aish and Ranbir.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu