»   » చెడు తిరుగుళ్లు తిరగకుండా.... కూతుళ్లను కట్టడిచేసిన శ్రీదేవి!

చెడు తిరుగుళ్లు తిరగకుండా.... కూతుళ్లను కట్టడిచేసిన శ్రీదేవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రీదేవి కూతుళ్లు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫోటోలు చూసిన చాలా మంది... వారు లేట్ నైట్ పార్టీలు, పబ్బులకు వెళతారని భావిస్తుంటారు. అయితే అలాంటివి తమ ఇంట్లో జరుగవని అంటోంది శ్రీదేవి. ఈ విషయంలో తాను చాలా స్ట్రిక్టుగా ఉంటానని, వారిని చెడు తిరుగుళ్లు తిరగనివ్వనని ఆమె తెలిపారు.

ఇటీవల డిఎన్ఏ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ....'తన ఇద్దరు కూతుళ్లకు ఎంత ఫ్రీడమ్ ఇస్తానో, క్రమశిక్షణ విషయంలో కూడా అంతే స్ట్రిక్టుగా ఉంటాను. వారు ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లినపుడు నేను నిర్ణయించిన టైమ్ లోపే రావాలని గట్టిగా చెబుతాను. లేట్ నైట్ పార్టీలకు వెళ్లడానికి తాను అస్సలు ఒప్పుకోను అని' శ్రీదేవి తెలిపారు.

లేట్ నైట్ పార్టీలు

లేట్ నైట్ పార్టీలు

పొద్దంతా ఇంట్లో పడుకుని, లేట్ నైట్ పార్టీలంటూ తిరుగుతానంటే తాను అస్సలు ఒప్పుకోను, ఈ విషయంలో నేను చాలా కఠినంగా ఉంటానని శ్రీదేవి తెలిపారు.

రూల్స్ అతిక్రమిస్తే అంతే...

రూల్స్ అతిక్రమిస్తే అంతే...

నా కూతుళ్లకంటూ తాను కొన్ని రూల్స్ పెట్టాను. వాటిని అతిక్రమిస్తే అస్సలు ఊరుకోను అని శ్రీదేవి తెలిపారు.

ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను

ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను

తన కూతుళ్లు ఎక్కడికెళ్లినా వారి గురించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే వారిని కంటికి రెప్పలా కాపాడు కోవడం ఒక తల్లిగా నా బాధ్యత అని శ్రీదేవి తెలిపారు.

ఎప్పుడూ అతిక్రమించలేదు

ఎప్పుడూ అతిక్రమించలేదు

నేను పెట్టిన రూల్స్ ఝాన్వి, ఖుషీ ఎప్పుడూ అతిక్రమించలేదు. వారికి నా మాట అంటే అంత గౌరవం అని శ్రీదేవి తెలిపారు.

శ్రీదేవి అందం అబ్బింది

శ్రీదేవి అందం అబ్బింది

కూతురు ఝాన్వికి శ్రీదేవి నుండి అందం అబ్బింది. త్వరలో ఆమె తల్లి బాటలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టి పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలుకంటోంది.

క్రమశిక్షణ గల అమ్మాయిలు

క్రమశిక్షణ గల అమ్మాయిలు

ఝాన్వి కపూర్, ఖుషీ కపూర్ బయట పార్టీలకు గానీ, స్నేహితులతో కలిసి ఎక్కడికెళ్లినా కూడా చాలా క్రమశిక్షణతో నడుచుకుంటారని టాక్.

త్వరలో బాలీవుడ్ ఎంట్రీ

త్వరలో బాలీవుడ్ ఎంట్రీ

ఝాన్వి కపూర్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఏ సినిమా అనేది ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు.

లిటిల్ ఏంజిల్స్

లిటిల్ ఏంజిల్స్

శ్రీదేవి, బోనీ కపూర్ తమ ఇద్దరు కూతుళ్లను ఎంతో గారాబంగా... లిటిల్ ఏంజిల్స్ లా చూసుకుంటారు. వారికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తారు. అదే సమయంలో కొన్ని విషయాల్లో కట్టడి చేస్తారు.

తల్లి, దండ్రుల పేరు నిలబెడతారు

తల్లి, దండ్రుల పేరు నిలబెడతారు

తమకు ఇద్దరూ కూతుళ్లే పుట్టినా శ్రీదేవి, బోనీ కపూర్ ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇద్దరూ కూతుళ్లపైనే వారి ఆశలు. తమ పేరు నిలబెట్టేలా ఓ స్థాయికి వెళతారని ఆశ పడుతున్నారు.

English summary
Sridevi said to DNA, "Yes, rules are same for both Jhanvi and Khushi. They know they have a curfew time and they have to be back home. Else, I will keep calling and inquiring. There's an insecurity about my children, when they go out, till they are back I am worried. I call them several times. These are all the basic things that any other mother keeps worrying about when it comes to her children."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu