»   » పెళ్ళి ఆలోచనే లేదు...సయ్యాటే ముఖ్యం: చార్మి

పెళ్ళి ఆలోచనే లేదు...సయ్యాటే ముఖ్యం: చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడితో నాకు నిశ్చితార్థం జరిగిందనీ, పెళ్లి శుభలేఖలు కూడా ముద్రించానని మీడియాలో వచ్చిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాను అంటూ చార్మి వాపోతోంది. ఆ మధ్య ఛార్మి పెళ్ళి చేసుకోబోతోందంటూ అంతటా వార్తలు వచ్చాయి. అలాగే ఫెళ్ళి కుమారుడు పంజాబ్ కి చెందిన బిజినెస్ మెన్ అనీ కూడా వినిపించింది. అయితే చార్మి వీటిన ఖండిస్తూ ప్రకటన చేసింది. ఆమె మాట్లాడుతూ "నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే. పెళ్లి కుదిరితే నేనే చెబుతాను" అంది. అలాగే తను నటించిన తాజా చిత్రం 'సై ఆట' త్వరలో విడుదల కానుందని, ఈ సినిమా తనను వెండితెరమీద సరికొత్తగా ఆవిష్కరిస్తుందనే నమ్మకం వుందని ఆమె తెలియచేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu