»   » ఇక బికినీలకు నో అంటూ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్

ఇక బికినీలకు నో అంటూ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ముంబై : బికినీ ఫోటో షూట్లతో అందాలు ఆరబోస్తూ అభిమానులకు ఇంతకాలం మంచి కిక్ ఇచ్చి పాకిస్తానీ భామ వీణా మాలిక్....ఉన్నట్టుండి ఫాన్స్‌కు షాకిచ్చే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక భవిష్యత్‌లో ఎప్పుడూ రెండు ముక్కల బికీనీ వేయనంటూ మీడియా ముఖంగా ప్రకటించింది.

  29 ఏళ్ల సెక్సీ ఒంపుసొంపులున్న వీణా మాలిక్ తన రాబోయే సినిమా 'సూపర్ మోడల్' చిత్రం కోసం లెక్కలేనన్ని బికినీలు ధరించింది. తాజాగా 'సూపర్ మోడల్' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై బికినీలే వేయనని స్పష్టం చేసింది.

  'తేరా ప్యార్ మే' అనే ఉర్దు చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ ప్రస్తుతం వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో భాగమైపోయింది. బాలీవుడ్ సినిమాలతో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, లాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఆమె పని చేస్తోంది. 'బాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో బికినీలు వేయాల్సి వచ్చింది. అయితే ఇకపై 2 ముక్కల బికినీలు వేసి నటించవద్దని నిర్ణయించుకున్నాను' అని వీణా తెలిపింది.

  వీణా మాలిక్ నటించిన 'సూపర్ మోడల్' మూవీ ఫస్ట్ లుక్ జులై 18న ముంబైలో విడుదల చేసారు. ఈ సందర్భంగా వీణా మాలిక్ మాట్లాడుతూ...'నా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. సూపర్ మోడల్ మూవీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక అమ్మాయి కథ. ఆమె స్టార్ డమ్ సొంతం చేసుకోవడానికి పడ్డ కష్టాలు తెరపై కనిపిస్తాయి. మీరు ఈ సినిమాలో మెస్ట్ గ్లామరస్ వీణాను చూస్తారు' అని తెలిపారు. నవిన్ బాత్రా దర్శకత్వం వహించిన ఈచిత్రం జులై 26న విడుదలవుతోంది.

  English summary
  'No more bikinis' says Pakistani actress Veena Malik, whose recent photos have been buzzing everywhere. The actress who has worn so many bikinis in her upcoming movie Supermodel says that she doesn't want to wear the two-piece garment ever again. The 29-year-old Malik seems fed-up with the outfit.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more