చిన్మయి డబ్బింగ్ కి బై: సమంత
హైదరాబాద్ : సమంత సూపర్ హిట్ 'ఏమాయ చేసావె' చిత్రంలో జెస్సిగా ఆమె ఎంత పాపులరో ఆమె గొంత కూడా అంతే పాపులర్. ఆ సినిమా హిట్ లో సమాన ప్రాధాన్యం కలిగిన చిన్మయి వాయిస్ ఇకపై సమంతకు వినిపించదు. దానికి కారణం ఇక నుంచి తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటమే. 'ఏమాయ చేసావె', 'బృందావనం', 'దూకుడు', 'ఈగ' చిత్రాల్లో సమంత పోషించిన పాత్రలకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం తను నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం తొలిసారి ఆమె సంభాషణలు చెప్పుకొంటోంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కి ప్రస్తుతం సమంత డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. ఈ విషయమై మాట్లాడుతూ...''తొలి సినిమా చేసేటప్పుడు నాకు తెలుగు అస్సలు రాదు. 'బృందావనం' నాటికి నేర్చుకోగలిగాను. ఇప్పుడు సంభాషణలు చెప్పుకోవడం సంతోషంగా ఉంది''ని సమంత చెబుతోంది. నయనతార 'కృష్ణం వందే జగద్గురుమ్' కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంది. ఆ జాబితాలో సమంత కూడా చేరింది.
ఈ చెన్నై భామ తెలుగు మాత్రమే కాదు తమిళంలోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటాను అంటోంది. ప్రస్తుతం ఈ బబ్లీగర్ల్ నటిస్తున్న త్రిభాషా చిత్రం నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆ మధ్య స్కిన్ ఎలర్జీ సమస్యతో సుమారు రెండు నెలలకు పైగా వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న సమంత ఇటీవలే మళ్లీ ముఖానికి రంగేసుకుంది. నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కోసం చెన్నైలో మకాంపెట్టిన సమంత డబ్బింగ్ ప్రక్రియ తనకు కొత్త అనుభవం అంటోంది.
చిన్మయి డబ్బింగ్‌తో తన పాత్రకు మెరుగులు దిద్దేవారమని అందువల్లే చిన్మయి అంటే తనకు చాలా అభిమానం అంటున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది. జీవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్‌మీనన్ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రం ఎటో వెళ్లి పోయింది మనస్సు టైటిల్ తో విడుదల అవుతోంది. తెలుగు వెర్షన్ కు గానూ నాని హీరోగా చేసారు. ఈ చిత్రం ఆడియో విడుదలై ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











