»   » ఇక కాజల్ కెరీర్ ముగింపుకి వచ్చినట్టేనా..?

ఇక కాజల్ కెరీర్ ముగింపుకి వచ్చినట్టేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్ అగర్వాల్ కి ఇయర్ 2015 అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. టెంపర్ మూవీ పరంగా హిట్టే అయినా కాజల్ కి మాత్రం ఈ సినిమా ఏమాత్రం ప్లస్ అవలేదు. తరువాత రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. వాటిల్లో ఒకటి పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్", అయితే మరొకటి మహేష్ బాబు "బ్రహ్మోత్సవం".

ఈ రెండు మూవీలు బాక్సాపీస్ వద్ద సత్తా చాటాయంటే ఇక కాజల్ కి మరో రెండు సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేదనే అనుకున్నారు అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండు సినిమాలూ డిజాస్టర్లుగా మిగిలాయి. సూపర్ స్టార్ల మధ్య నటించానన్న సంతోషం కాస్తా. ఈ సినిమాల ఫలితాలతో ఆవిరైపోయింది. ఇప్పుడిక కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

ఇక ఈమె నటించిన తమిళ సినిమా "ఇంజి ఇదిపాజ్హాగి" కూడా అక్కడ అంతంత మాత్రంగానే ఆడింది. తెలుగులో లేకపోవడంతో కాజల్ తమిళ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ అక్కడి అవకాశాలు చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అక్కడా పరిస్తితి కాస్త తేడాగానే ఉందనీ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ.

No new Telugu movie offers for Kajal Aggarwal

బాలీవుడ్ లో మాత్రం బ్లైండ్ గర్ల్ గా నటించిన మూవీ "దో లఫ్జోన్ కి కహాని" అక్కడ మంచి హైప్ క్రియేట్ చేసుకొంది. కనీసం ఈ సినిమా అయిన కాజల్ కి ఊరట ఇస్తుందో లేదో ఇంకా తెలియటం లేదు. (బహుశా ఈ సినిమాలో చేసిన లిప్ లాక్ ఇందుకు ఉపయోగ పడొచ్చు) 2015 కాజల్ కి అన్నీ ఫ్లాప్ లనే ఇచ్చింది మరి ఇయర్ 2016 అయిన కాజల్ కు కలసి వస్తుందో లేదో చూడాలి.

అయితే ఆమె ఈ గ్లామర్ ఇండస్ట్రీ లోకి వచ్చి పదేళ్ళు దగ్గర పడుతోంది రోజు రోజు కీ కాంపిటీషన్ పెరిగి పోతున్న ఈ రంగం లో కాజల్ లో మునుపటి గ్లో కూడా పోయిన నేపథ్యంలో ఆమె ఇంకెంతో కాలం హీరోయిన్ గా కొనసాగకపోవచ్చేమో... అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు...

English summary
One of top most beauties, Tollywood Kajal Agarwal don’t have any offers in Telugu film industry Now...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu