twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాల్లో మేడమ్ కెరీర్ క్లోజైనట్టేనా..?? బాహుబలి పెద్ద మైనస్ అయ్యిందా??

    'బాహుబలి' తర్వాత ఒక్క తమిళంలో మాత్రమే తమన్నాకు అవకాశాలు పెరిగాయి. తెలుగులో ఛాన్సులు నిల్. అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు.

    |

    మోదటి నుంచీ పాపం తమన్నా తో సక్సెస్ దోబూచులాడుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా దాదాపు అందరు అగ్రహీరోల సరసనా నటించినా ఇప్పటికీ తమన్నాకి నిలదొక్కుకోగల పెద్ద బ్రేక్ ఏదీ రాలేదు. వెండితెరపై ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించింది మిల్కీ బ్యూటి తమన్నా. వరుసగా బాహుబలి, ఊపిరి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు సక్సెస్ సాధించటంతో తమన్నా కెరీర్ తిరిగి గాడిలో పడినట్టే కనిపించింది. అదే సమయంలో అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు.

    తెలుగులో ఛాన్సులు నిల్

    తెలుగులో ఛాన్సులు నిల్

    'బాహుబలి' తర్వాత ఒక్క తమిళంలో మాత్రమే తమన్నాకు అవకాశాలు పెరిగాయి. తెలుగులో ఛాన్సులు నిల్. గత ఏడాది తమ్మూ తెలుగు ప్రేక్షకుల్ని ఒక్క 'అభినేత్రి' సినిమాతో మాత్రమే పలకరించింది. అది ఫ్లాప్ అయింది. అది బేసిగ్గా తెలుగు సినిమా కాదు. ప్రస్తుతం తమిళంలో 'పెళ్లిచూపులు' రీమేక్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తోంది తమ్మూ. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరో.

    బాహుబలి లో ఒక్క నిమిషం కూడా కనిపించకపోవడం

    బాహుబలి లో ఒక్క నిమిషం కూడా కనిపించకపోవడం

    అతడికీ తెలుగు సినిమాల్లో అతడి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు కూడా తమిళంలో క్రేజ్ రావొచ్చేమో కానీ తెలుగులో సందేహమే. 'బాహుబలి: ది కంక్లూజన్'లో తమన్నా ఒక్క నిమిషం కూడా కనిపించకపోవడం ఆమె కెరీర్ మీద కొంచెం ప్రతికూల ప్రభావమే చూపింది.

    కొలైయుదిర్‌కాలం

    కొలైయుదిర్‌కాలం

    అయితే ప్రభుదేవాతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో నటించిన ‘దేవి' చిత్రం హిందీలో విజయాన్ని అదించింది. దీంతో తమన్నాకు రెండు కొత్త సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి. అంతేకాకుండా తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయుదిర్‌కాలం' చిత్రం హిందీ వెర్షన్లో నయన పాత్రలో తమన్నా నటిస్తోంది.

    హిందీ సినిమాల్లో

    హిందీ సినిమాల్లో

    బాహుబలి తర్వాత వస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిందీ సినిమాల్లో కూడా కలల రాణిగా మారడానికి తమన్నా అక్కడే మకాం వేసి కథలు వింటోంది. అదే సమయంలో అందచందాల ప్రదర్శనను పక్కన పెట్టి, నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలను పసిగట్టే పనిలో పడింది తమన్నా.

    క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది

    క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది

    సినీరంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు కావస్తున్నా అందంతోనే నెట్టుకొస్తున్న తమన్నా ఇకనైనా కథా బలమున్న చిత్రాల వైపుకు వెళ్లకపోతే కెరీక్ ఎక్కువ కాలం కొనసాగదని సినీ పండితుల సూచన. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే తెలుగు సినిమాల్లో తమన్నా కెరీర్ క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది.

    English summary
    Tamanna who is in top most position in Telugu Film Industry Carrier is in trouble
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X