Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా ఫ్యామిలీ చూస్తే.. లిప్‌లాక్ సీన్స్, ఎక్స్‌ఫోజింగ్.. అందుకేనట సాయి పల్లవి ఇలా!
వెండి తెరపై రాణించాలి అంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పాత రోజులనుంచి ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు నిరూపిస్తూ వస్తున్నారు. చక్కటి రూపం, ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే సత్తా ఉంటే చాలు. హద్దులు దాటేలా గ్లామర్ షో అవసరం లేదు. అందుకు మలయాళీ భామ సాయి పల్లవి తాజా ఉదాహరణ. సాయి పల్లవి తాజాగా నటించిన పడి పడి లేచే మనసు చిత్రం థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

నటన కోసం మెడిసిన్ వదిలేసి
సాయిపల్లవి మెడిసిన్ విద్యార్థిగా కొనసాగుతుండగా ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 2015లో సాయి పల్లవి ప్రేమమ్ చిత్రంతో సౌత్ మొత్తం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మలర్ పాత్రలో యువతని ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో నటించిన ఫిదా చిత్రంలో ఇక్కడకి యువత కూడా సాయి పల్లవికి దాసులైపోయారు. సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్.

శరీరం కనిపించేలా దుస్తులు
గ్లామర్ షోపై సాయి పల్లవి మరో మారు తన మనసులో మాట బయట పెట్టేసింది. వెండి తెరపై ఎక్స్ ఫోజింగ్ చేయడం న వల్ల కాదు. అలాంటి సన్నివేశాల్లో నటించాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని సాయి పల్లవి తెలిపింది. నేను మెడిసిన్ చదువు వదిలేసి వచ్చింది నటిగా గుర్తింపు పొందడానికి. గ్లామర్ షోలు చేయడానికి కాదు. నటిగా కొనసాగినన్ని రోజులు మంచి పాత్రల్లో నటించడానికి ప్రయత్నిస్తా అని సాయి పల్లవి తెలిపింది.
స్కూల్లో అల్లు అర్జున్ పాటలకు డాన్స్.. హీరోయిన్లు అంతా శర్వానంద్ గురించి.. సాయి పల్లవి!

నా ఫ్యామిలీ చూడాలి కదా
ఇక లిప్ లాక్ సన్నివేశాలలో కూడా తాను నటించనని సాయి పల్లవి తేల్చి చెప్పింది. నేను నటించే చిత్రాలన్నీ నా కుటుంబ సభ్యులు చూడాలి అని అనుకుంటాను. నేను గ్లామర్ షో, లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తే వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది.. అది నాకు కూడా సరిగా అనిపించదు అని సాయి పల్లవి తెలిపింది.

వ్యతిరేకం కాదు
అలాగని గ్లామర్ షోకు నేను వ్యతిరేకం కాదు. అలాంటి సన్నివేశాల్లో నేను నటించలేను అంతే అని సాయి పల్లవి తెలిపింది. తెలుగులో సాయి పల్లవి ఫిదా, ఎంసీఏ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. హను రాఘవపూడి దర్శత్వంలో తెరకెక్కిన పడిపడి లేచిమనసు చిత్రంలో కూడా సాయి పల్లవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.