»   » చిన్న దెబ్బే, ఏమీ విరగలేదు: రానా వివరణ

చిన్న దెబ్బే, ఏమీ విరగలేదు: రానా వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం బాహుబలి -2 షూటింగ్ లో దెబ్బ తగలి, చేయి విరిగిందంటూ వచ్చిన రూమర్స్ ని దగ్గుపాటి రానా కొట్టిపారేసారు. కేవలం తాను

స్వల్పంగా గాయపడినట్లు తెలియచేసారు. అందుకు ఎవిడెన్స్ అన్నట్లుగా... మణికట్టుకు బ్యాండేజి వేసున్న ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.తన మణికట్టుకు గాయమైందని, అందువల్ల ఈ టేప్ వేసుకున్నానని చెప్పాడు. త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయి శిక్షణ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. ఈ నేపధ్యంలో త్వరగా కోలుకోండంటూ అభిమానుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.


అయితే మీడియాలో మాత్రం రానా చేయి విరిగిందంటూ ప్రచారం మొదలైంది. దాంతో రానా వెంటనే రంగంలోకి దిగి అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసారు. గతంలోనూ ఇలాగే దెబ్బ తగిలినప్పుడు భారీ యాక్షన్ సినిమాల షూటింగుల్లో ఇటువంటి గాయాలు సాధారణమేనంటూ రానా చెప్పిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.


Taped up my damaged wrist for full blown training soon!! #Baahubali


A photo posted by Rana Daggubati (@ranadaggubati) on May 25, 2016 at 9:26am PDTప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2017లో బాహుబలి- 2 సినిమా రిలీజ్ కానుంది. త్వరలో రానా, అనుష్క షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. మొత్తం షూటింగ్ అక్టోబర్ వరకు పూర్తవుతుందని చెప్తున్నారు. మిగతా సమయాన్ని గ్రాఫిక్స్ మిక్స్ చేయటానికి పడుతుందన్నమాట. 2017 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.


English summary
Daggupati Rana has put rest to all the speculations about mishap on the movie's sets. He tweeted, "I didn't break anything yet ;) its a small injury thats all :)."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu