»   » ‘ఆంధ్రాపోరి’ వివాదం: తొలిగిన అడ్డంకి...రేపే రిలీజ్

‘ఆంధ్రాపోరి’ వివాదం: తొలిగిన అడ్డంకి...రేపే రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ ప్రధాన పాత్రలో ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆంధ్రాపోరి'. ఈ సినిమాకు ‘ఆంధ్రాపోరి' అనే టైటిల్ అనౌన్స్ చేసిన మరుక్షణం నుండి సినిమాపై కొందరు ఆంధ్రా ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా ఆంధ్రా సెటిలర్స్ ఫోరమ్ ప్రతినిధులు వేసిన ఓ పిటిషన్ హైకోర్టు ముందుకు వచ్చింది. అయితే అందుతున్న సమచారం ప్రకారం కేసు కొట్టివేశారని, అడ్డంకి తొలిగి, విడుదలకు సిద్దమైందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘ఆంధ్రాపోరి' అనే టైటిల్ ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వారు వేసిన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగింది. ఇక ఈ విషయంలో ‘ఆంధ్రాపోరి' టీమ్ మొదట్నుంచే సరైన క్లారిటీ ఇస్తూ వస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ చదువుకోని అబ్బాయి తన ప్రేయసి అయిన ఆంధ్రా అమ్మాయిని ముద్దుగా ‘ఆంధ్రాపోరి' అని పిలుచుకుంటాడని, వేరే ఇతర ఉద్దేశాలు ఆపాదించే అవసరం తమకు లేదని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు ఈ రోజు కోర్టులో అడ్డంకి తొలగటంతో రిలీఫ్ ఫీలయ్యారు.


No problem to Andhra Pori screening

దర్శకుడు మాట్లాడుతూ... ‘ఋషి' తర్వాత ఏదైనా మంచి రొమాంటిక్ కామెడీ చేద్దామనుకున్నా. ఆ సమయంలోనే మరాఠీలో ఘన విజయం సాధించిన టైమ్‌పాస్ విడుదలైంది. ఆ సినిమా చూసినతర్వాత ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ సినిమాను రీమేక్ చేయవచ్చా? లేదా? అన్నది కొంత పరిశీలించుకున్నాక రీమేక్‌కి సిద్ధమైపోయాం.


అలాగే ముందుగా అంతా కొత్తవాళ్ళతోనే చిన్న సినిమాగా తెరకెక్కించాలనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ దశలో వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఆకాష్, ఉల్కా గుప్తా ఇలా కొంత ఐడెంటిటీ ఉన్నవాళ్ళు చేరడంతో పెద్ద సినిమా అయిపోయింది అని అన్నారు.


కథ గురించి మాట్లాడుతూ...‘ఆంధ్రాపోరి' ఒక ఇన్నోసెంట్ టీనేజ్ లవ్‌స్టోరి. ప్రతి ఒక్కరూ అందమైన తొలిప్రేమ దశను దాటుకొని వచ్చినవారే! 1990 నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఓ టీనేజ్ జంటలో ఉండే అమాయకత్వాన్ని, తొలిప్రేమలోని అల్లరిని చూడొచ్చు. ఈతరం వారు తమను తాము తెరపై చూసుకోవడంతో పాటు, ప్రేమ అనే దానికి అర్థాన్ని తెల్సుకుంటారు. ఇక ఈ దశను దాటేసి వచ్చిన వారికైతే తమ తొలిప్రేమను తట్టిలేపి అందంగా చూపే సినిమాగా ‘ఆంధ్రాపోరి' నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు.

English summary
Andhra Pori has landed in some problems regarding its title. The case was moved to the high court recently and the fresh and final hearing heard on this case today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu