»   »  రాఖీ సావంత్ సాంగ్ నచ్చలేదు!

రాఖీ సావంత్ సాంగ్ నచ్చలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rakhi Sawant
బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ చేసిన ఐటం సాంగ్ తనకి నచ్చలేదు ...తీసేయ్యాల్సిందే అని పట్టుపడుతున్నాడు ఓ పెద్దాయన. పోనీ అతను అంత పవిత్రుడా అంటే నకిలీ స్టాంపు పత్రాల కుంభకోణం లో ప్రథాన సూత్రథారి ఆ వ్యక్తి. అతనే తెల్గి . అతని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా 'మంద్రంక్'. ఆ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ కావల్సి ఉంది. అయితే తెల్గీ దానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. ఆ చిత్రంలో తెల్గీ పాత్రను వెల్గీ పేరుతో కృష్ణ మానవ్ అనే నటుడు పోషిస్తున్నాడు. దీని నిమిత్తం అతను తెల్గీని సోమవారం సెషన్స్ కోర్టులో కలిసాడు. చిత్రం విడుదలుకు సంభందించి వీరిద్దిరి మధ్యం కోర్టులో కొద్ది సేపు ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగాయి.
రాఖీ సావంత్ సాంగ్ వచ్చినప్పుడు తాను గట్టిగా కళ్ళు మూసుకున్నాని తెల్గీ చేప్పాడు. చాలా వెగటు పుట్టించేలా సాంగ్ ఉందని విమర్శించాడు. ఆ సినిమా కథనం వాస్తవికతకు దూరంగా ఉందని క్రితం సారి ప్రివ్యూ చూసినప్పుడు తెల్గీ చేప్పాడు.అందులో తనతో పాటు కుంభకోణంలో పలువురు పోలీసులు, రాజకీయనాయకులు కుమ్మక్కైనట్లు చూపించారని అది బయటకు వస్తే తాను మరింత ప్రమాదంలో చిక్కుకుంటానని అప్పుడు తెల్గీ ఆందోళన వ్యక్తం చేసాడు. ఇప్పుడీ కారణం చూపుతున్నాడు. అంతేగాక ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీసారని గ్యారెంటీగా ఫ్లాఫ్ అవుతుందని అంటున్నాడు. తన కథతో మహేష్ భట్ వంటి బడా నిర్మాతలే సినిమా తీయటానికి ఆసక్తి చూపించారని చెప్పుకొచ్చాడు. చివరికి త్వరలోనే తాను ఒక పరిష్కారం ఆలోచించి కబురు పంపుతానని తెల్గీ తేల్చేసాడు. మొత్తానికి రాఖీ సావంత్ సాంగ్ కూడా నచ్చని వారు ఉన్నారా అని ఈ వార్త విన్న వాళ్లు నిట్టార్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X