twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇబ్బందుల్లో ఆర్జీవీ, నాగ్ సినిమా.. డిస్ట్రిబ్యూటర్స్ లేరు, కారణం ఆ గొడవేనా అంటూ జాతీయ పత్రికల్లో!

    |

    Recommended Video

    Officer Movie Faces Distributers Problem

    ఏ ముహూర్తాన వర్మ, నాగార్జున ఆఫీసర్ చిత్రం మొదలైందో కానీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మొదట ఈ చిత్రం మే 25 న విడుదలవుతుందంటూ ప్రకటించారు. కానీ జూన్ 1 కి విడుదల వాయిదా పడింది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ చిత్రంపై బాంబే కోర్టులో కేసు నమోదైందని వార్తలు వచ్చాయి. ఈ చిత్ర కథ నాదే అంటూ ఓ యువ రచయిత తెరపైకి వచ్చాడు. తాజగా ఆఫీసర్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ సమస్య ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫీసర్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఆర్జీవీ, నాగ్ సినిమకు తలెత్తిన ఈ పరిస్థికి కారణం అంటూ జాతీయ ఆంగ్ల పత్రికలో ఆసక్తికర కథనం వెలువడింది.

    చిన్న చిత్రాలకు సాధారణమే కానీ

    చిన్న చిత్రాలకు సాధారణమే కానీ

    సాధారణంగా చిన్న చిత్రాలు విడుదల సమస్యలు ఎదుర్కొంటుంటాయి. ఆ పరిస్థిని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాం. కానీ అదే సమస్య నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి తలెత్తితే ఆశ్చర్యకరమైన విషయమే. ఆఫీసర్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడంలేదంటూ ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

     నాలుగవ సారి వర్మతో

    నాలుగవ సారి వర్మతో

    నాగర్ణున, వర్మ కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. నాగార్జున, వర్మ కాంబినేషన్ ఎంతటి సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఆఫీసర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపడం లేదట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

    పవన్ కళ్యాణ్‌తో వివాదం

    పవన్ కళ్యాణ్‌తో వివాదం

    పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అయన తల్లిని శ్రీరెడ్డి దారుణంగా దూషించిన సంగతి తెలిసిందే. ఈ ఘనకార్యం చేయించింది నేనే అంటూ వర్మ నిస్సిగ్గుగా ఒప్పుకోవడంతో అతడి పేరు మరింతగా దిగజారింది.

    వరుస ప్లాపులు

    వరుస ప్లాపులు

    వర్మ తక్కువ బడ్జెట్ లోనే చిత్రాలు తెరకెక్కిస్తారు. అయినా కూడా ఆయన చిత్రాలు ఇటీవల వరుసగా పరాజయం చెందుతూ వచ్చాయి. ఇది నాగార్జునతో తెరకెక్కించిన చిత్రం కావున బయ్యర్లు కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

    నాగార్జున సన్నిహితుడు

    నాగార్జున సన్నిహితుడు

    నాగార్జున సన్నిహితుడు శివప్రసాద్ రెడ్డి కృష్ణ ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సీడెడ్ హక్కులని ఎన్ వి ప్రసాద్ దక్కించుకున్నారట. నైజాంతో పాటు మరి కొన్ని ఏరియాలలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపడం లేదట.

     సొంతంగా విడుదల

    సొంతంగా విడుదల

    ఆఫీసర్ చిత్రాన్ని ఆయా ఏరియాలలో సొంతగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కోప్రొడ్యూసర్ సుధీర్ చంద్ర మాట్లాడుతూ '' మహేష్, బన్నీ లాంటి పెద్ద హీరోల చిత్రాలకు మాత్రమే బయ్యర్లు ఆసక్తి చూపుతారని, మిగిలిన చిత్రాలకు నిర్మాతలే సొంతంగా విడుదల ప్లాన్ చేసుకుంటారని ఆయన అన్నారు. కానీ నాగార్జున చిన్న నటుడు కాదు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

    మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం

    మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం

    నైజాం ఏరియాలో ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం ఇలా ఉంది. 'ఈ చిత్రంలో నాగార్జున తప్ప మరో తెలుగు నటుడు లేడు. వర్మ మంచి దర్శకుడే. కానీ అతడి చిత్రాలని కొనుగోలు చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని బయ్యర్లు భావిస్తున్నారు' అని ఆ డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు.

    పవన్ కళ్యాణ్ పలుకుబడి

    పవన్ కళ్యాణ్ పలుకుబడి

    ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పలుకుబడి పనిచేసిందా అనేందుకు ఆధారాలు లేవు. కానీ ఆ విషయాన్ని కూడా కొట్టిపారేయలేం. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ చరిష్మా ఉన్న వ్యక్తి. రాంగోపాల్ వర్మ అనవసరంగా పవన్ వివాదంలో ఇరుక్కున్నాడు. అది కాకుండా ఇటీవల కూడా పవన్ పై వ్యంగ్యంగా అతడు చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించేవి అనడంలో సందేహం లేదు.

    English summary
    No takers for Nagarjuna-RGlV’s officer. Here is the reasons
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X