»   » ఇక అలాంటి పాత్రలు చేయను, నా ఆకలి తీరిపోయింది: అనుష్క

ఇక అలాంటి పాత్రలు చేయను, నా ఆకలి తీరిపోయింది: అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu
"I will Not Accept Reguler Charecters" Actress Anushka says నా ఆకలి తీరిందీ..

రెగ్యులర్ పాత్రల మీద బోర్ కొట్టేసినట్టుంది అనుష్క కి ఇక పైన మామూలు పాత్రలు లైట్ తీసుకుంటుందట. అదేంటంటే "నా ఆకలి తీరిందీ అంటోంది" అంటోంది. అవును అరుంధతి సినిమాతో నటిగా తన ఆకలి తీరిందట.. ఇక ఆ రేంజ్ సినిమా వస్తుందనుకోలేదని తెలిపింది. కానీ అదృష్టవశాత్తు బాహుబలి, రుద్రమదేవి కథలు తనకు దొరికాయంటోంది.

"ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ ఆకలి తీరిన తర్వాతే కొత్త రుచులు కావలనిపిస్తుంది. ఇదే విషయం సినిమాల్లోనూ వర్తిస్తుంది." అంటోంది. కేరీర్ ప్రారంభంలోనే అరుంధతితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో అదరగొట్టింది.

No Tension about my movies: Anushka

ఆ రేంజ్ సినిమాలు చేసిన తర్వాత మళ్లీ చిన్న సినిమాల జోలికి వెళ్లలేరు కదా.. అందుకే కథల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తోందట. తన చేతిలో సినిమాలు లేవు అనుకున్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటే ఇప్పటి వరకూ చేసిన సినిమాల్ని అపహాస్యం చేసినట్టవుతుందని పేర్కొంది అనుష్క.

ఆమె అప్ కమింగ్ మూవీ భాగమతి 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి చిన్న పాత్రలతో తనదగ్గరికి రావొద్దని చెప్పేస్తోందన్న మాట. ఇంతకీ మొన్న ప్రభాస్ తో పెళ్ళి అన్న న్యూస్ మీద మాత్రం ఏమీ చెప్పటం లేదు. ఎటూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాక ఇన నేనేం చెప్పాలి అనుకుందో ఏమో గానీ ఆ విషయం మీద పెద్దగా స్పందించటం లేదు మరి.

English summary
Tollywood Actress Anushka says That she will not accepts reguler charecters
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu