For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేణూ దేశాయ్ క్రేజ్ కూడా పని చేయలేదా?: "నీతోనే డాన్స్" టీఆర్పీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు

  |

  "డాన్స్ రియాలిటీ షో" అన్న కాన్సెప్ట్ ఒకప్పుడు తెలుగు తెరకి పెద్దగా అందలేదు. చాలాకాలం పాటు తెలుగు టీవీ షోలన్నీ సీరియల్స్ మీదనే నడిచాయ్. దాదాపుగా ఒక పదేళ్ళపాటు రియాలిటీ షోలకి దూరంగానే ఉండిపోయింది. దూరదర్శన్ కొన్ని షోలని ప్లాన్ చేసినా పెద్దగా ఒరిగిందేమీ లేదు.

  పవర్ స్టార్ పాటతో శివ బాలాజీ.. రేణు దేశాయ్ షోలో టెన్షన్!
  డాన్స్ బేబీ డాన్స్

  డాన్స్ బేబీ డాన్స్

  అయితే ఈ తరహా ట్రెండ్‌కి ఒక క్రేజ్ వచ్చింది జెమినీ టీవీ లో మొదలైన డాన్స్ బేబీ డాన్స్ అనుకోవచ్చు.. ఆ తర్వాత ఓంకార్ మొదలు పెట్టిన ఆట లాంటి డాన్స్ కాంపిటీషన్ షోలతో ఒక స్టార్ రేంజ్ వచ్చేసింది, ఇక "ఢీ" రాకతో ఒక్కసారిగా డాన్స్ షోల రూపమే మారిపోయింది ఈ షోని ఒక గ్రాండ్ ఈవెంట్ అన్నంత క్రేజ్‌తో సీజన్లుగా కంటిన్యూ చేస్తూనే ఉంది ఈ టీవీ...

  స్టార్ డమ్ తగ్గిపోయిన హీరోయిన్లు

  స్టార్ డమ్ తగ్గిపోయిన హీరోయిన్లు

  ఇక ఆ ట్రెండ్ కూడా కొన్నాళ్ళుగా తగ్గిపోతూ వచ్చింది కామెడీ వేదిక చేసుకుంటూ వచ్చిన జబర్దస్త్ అటు కామెడీ తోనూ ఇటు వివాదాలతోనూ బాగానే ఊపందుకోవటంతో డాన్స్ షోల ప్రభావం తగ్గుతూ వచ్చింది. అలంటి సమయం లో ఇంకో ప్రయోగంగా స్టార్‌డమ్ తగ్గిపోయిన హీరోయిన్లని తీసుకురావటం మొదలయ్యింది.

  నీతోనే డాన్స్

  నీతోనే డాన్స్

  ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు మా టీవీ మొదలు పెట్టిన కొత్త డాన్స్ షో "నీతోనే డాన్స్" హిందీలో సూపర్ హిట్ గా పేరు తెచ్చుకున్న డాన్స్ షో "నచ్ బలియే" కి తెలుగు వెర్షన్ దీనికి జడ్జ్ గా అప్పట్లో మాధురీ దీక్షిత్ చేసింది. అయితే అదే షోకి తెలుగు వెర్షన్ తెచ్చే ప్రయత్నం లో కొంత స్టార్ గ్లామర్ కోసం పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అయిన రేణూ దేశాయ్ ని జడ్జ్ గా తీసుకొచ్చారు.

  టీఆర్పీలు పెంచాలంటే

  టీఆర్పీలు పెంచాలంటే

  ఈ రకంగా ప్రోగ్రాం ని హిట్ చేయాలని చూసారు కానీ పాపం అస్సలు ఎవరూ పట్టించుకున్నట్టు లేదు... కేవలం రేణూ దేశాయ్ అన్న ట్యాగ్ ని చూపించి ఈ షోని నడిపించటం కష్టంగానే ఉంది. మరి టీఆర్పీలు పెంచాలంటే ఎలా?? దీనికోసం ఇంతకు ముందు ఒక ట్రిక్ ఉండేది.

   ఉత్తుత్తి గొడవలతో

  ఉత్తుత్తి గొడవలతో

  అదే "కాంట్రవర్సీ" ఓంకార్ ఫార్ములాగా మొదలైన ఈ తరహా ట్రేండ్ ని తర్వాత చాలా షోలే వాడేసుకున్నాయి. ఆఖరికి జబర్దస్థ్ లోకూడా ఈ తరహా ఉత్తుత్తి గొడవలతో కొన్ని ఎపిసోడ్స్‌ని హైలేట్ చేసారు. అయితే కొన్నాళ్ళకి ఆ ట్రిక్ కూడా పని చేయటం మానేసింది.

  కాంట్రవర్సీ ఫార్ములా

  కాంట్రవర్సీ ఫార్ములా

  ఇక నీతోనే డాన్స్ అయితే మరీ నానాటికీ తీసికట్టు అన్నట్టుగా ఉందట అందుకే ఇప్పుడు కొత్త అట్రాక్షన్ కొసం చూస్తున్నారు... పాతపద్దతిలోనే ఏదైనా కాంట్రవర్సీ చేద్దామా అంటే ఆ ఫార్ములాకూడా వర్కౌట్ కాదని అర్థమవటంతో కొత్త పద్దతిలో ఆలోచించారు...

   నీతోనే డాన్స్ కాంపిటీషన్

  నీతోనే డాన్స్ కాంపిటీషన్

  పెద్దల సమక్షంలో పెళ్లి జరుగని టీవీ నటులు రవికిరణ్, సుష్మాలకు నీతోనే డాన్స్ కాంపిటీషన్ వేడుకపై వారికి పెళ్లి చేశారు. పెళ్లికి హాజరుకాని రవికిరణ్, సుష్మ తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించారు. రేణుదేశాయ్ నేతృత్వంలో జరిగిన రవికిరణ్, సుష్మ పెళ్లికి హీరో ఆదర్శ్ దంపతులు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు.

  కుదరని పనే

  కుదరని పనే

  ఈ వేడుక చాలా సంతోష క్షణాల మధ్య జరిగింది. దాంతో మరోసారి కుటుంబ సభ్యుల మధ్యలో రవికిరణ్, సుష్మ దంపతులు మరోసారి ఒక్కటయ్యారు. ఈ ఏపిసోడ్ కొంత జనంలోకి వెళ్ళింది. అయితే ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి జరపాలంటే మాత్రం కుదరని పనే. నచ్ బలియే లాంటి సూపర్ హిట్ ప్రోగ్రాంకి పేరడీగా మొదలైన ఈ ప్రోగ్రాం ఎన్నాళ్ళు ఇలా నడిపిస్తారో చూడాలి...

  English summary
  Telugu audience and Mega fans will never forget Pawan Kalyan ex-wife Renu Desai got a chance for judge in a days show ‘Neethone Dance’ but The TRPs for this show are very poor
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X