»   » ఏది వల్గారిటి? బెల్లకొండ ఓపెన్ చాలెంజ్

ఏది వల్గారిటి? బెల్లకొండ ఓపెన్ చాలెంజ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'బస్ స్టాఫ్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈచిత్రంలో వర్గారిటీ ఉందని ఆ మధ్య ఆందోళన కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.

  ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన 'బస్ స్టాప్' సక్సెస్ మీట్లో ఓపెన్ చాలెంజ్ విసిరారు బెల్లంకొండ. సినిమాలో వల్గారిటీ ఉందనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని, థియేటర్ వచ్చి సినిమా చూస్తే సినిమాలో ఎలా ఉందో అర్థం అవుతుందని అన్నారు. మా సినిమా మంచి ఎంటర్ టైనరే కాదు... యూత్‌కి, పేరెంట్స్‌కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని బెల్లంకొండ చెప్పుకొచ్చారు.

  ఈ సినిమాను తమిళ, కన్నడ, హిందీలో నిర్మిస్తాను అని చెప్పిన బెల్లంకొండ... మారుతి ఖాళీగా ఉంటే అతనికే దర్శకత్వం చేసే అవకాశం ఇస్తాను అని స్పష్టం చేసారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ నేను ఈ కథను నాలుగేళ్ల క్రితం రాసుకున్నాను. చాలా మంది నిర్మాతలను కలిసినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ రోజు ఈ సినిమా 300 థియేటర్లలో విడుదలై విజయం సాధించిందంటే ఇదంతా బెల్లంకొండ సురేష్ గారి క్రెడిటే అన్నారు.

  ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గణేష్ బాబు, బిఎ రాజు, మహేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు జీవన్ బాబు, ప్రిన్స్, శ్రీ దివ్య, రాంబాబు, ఎఫ్.ఎం బాబాయ్, హాసిక, ఏలూరు శ్రీను, సాయి, గోపాల సాయి, ఖన్నా, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  “Lot of people think there is vulgarity in my film, but it’s my open challenge to every one to come watch my film and then let us know if there is any obscenity. My film is not only entertaining but also has a serious message for the youngsters” Bellamkonda Suresh told.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more