»   » జీవితా రాజశేఖర్ లకు అరెస్ట్ వారెంట్!

జీవితా రాజశేఖర్ లకు అరెస్ట్ వారెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉండే జీవిత రాజశేఖర్ తాజాగా చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారు. వారిద్దరికి నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసు లో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

తమ సినిమా కోసం చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారు. ప్రామిసరీ నోటుతో పాటు రెండు చెక్కులను పూచీ కత్తుగా ఇచ్చారు. అయితే తర్వాత ఆ మొత్తం తిరిగి ఇవ్వలేదు. దాంతో పరంధామరెడ్డి ఆ చెక్ లను బ్యాంకర్ లో డిపాజిట్ చేసారు. అయితే బ్యాంక్ లో డబ్బు లేకపోవటంతో అవి బౌన్స్ అయ్యాయి. చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు.

బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. గతంలో సెప్టెంబర్ 20 న ప్రత్యక్ష్యంగా హజరయ్యి వివరణ ఇవ్వాలని కోరింది. అయితదే జరలేదు. జీవితా రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
A court in Nampally (Hyderabad) today issued a non-bailable arrest warrant against Tollywood actress and producer Jeevita Rajasekhar in connection with a bounced cheque of 36 lakh rupees. Parandhama Reddy, a financier, filed the case after the cheque was not honoured.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu