For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రాణం కోసం చివరి వరకు పోరాటం చేసిన నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గంటలోనే ..

  |

  కెమెరా ముందు ఎంతో హుందాగా కనిపించే నటీనటులు తెరవెనుక మాత్రం కొన్నిసార్లు ఊహించని కష్టాలను ఎదుర్కొంటు వుంటారు. అందరి జీవితం ఒకేలా ఉండదు. ఎంత స్టార్ డమ్ అనుభవించినా కూడా కొన్నిసార్లు అనుకోని సంఘటనలతో జీవితమే మారిపోతుంది. ఇక ఇటీవల ఒక టాలెంటేడ్ యాక్టర్ చివరి క్షణం వరకు పోరాటం చేశాడు. సోషల్ మీడియాలో కూడా ఎంతగానో అర్ధించాడు. కానీ అతని ప్రాణాలు నిలవలేదు.

  ఎక్కడ చూసినా కూడా

  ఎక్కడ చూసినా కూడా

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వినాశనం సృష్టిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానెల్స్ లో ఎక్కడ చూసినా కూడా విషాద వార్తలే దర్శనమిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే చాలామంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

  3వ వేవ్ ఇంకెలా ఉంటుందో..?

  3వ వేవ్ ఇంకెలా ఉంటుందో..?

  గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లోనే భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి అంటే ఇక మూడవ వేవ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వైరస్ వలన ఇటీవల మరణించిన ఒక నటుడు చనిపోయే ముందు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసిన తీరు కలచివేస్తోంది.

   గత వారం నుంచి..

  గత వారం నుంచి..

  అతని పేరు రాహుల్ వోహ్రా. సహాయం చేస్తే తప్పకుండా బ్రతుకుతాను అంటూ గత వారం నుంచి సోషల్ మీడియా ద్వారా అనేక మందిని సహాయం కోరాడు. కానీ సకాలంలో ఎవరు స్పందించలేదు. నెట్ ఫ్లిక్స్ వంటి బడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో అన్‌ఫ్రీడమ్‌ అనే వెబ్ సిరీస్ ద్వారా రాహుల్ మంచి గుర్తింపు అందుకున్నాడు.

  అతని వీడియోలకు 100మిలియన్ల వ్యూవ్స్

  అతని వీడియోలకు 100మిలియన్ల వ్యూవ్స్

  ఉత్తరాఖండ్‌కు చెందిన రాహుల్ కు 1.9 మిలియన్ల ఫేస్ బుక్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక అతని వీడియోలు కొన్ని 100మిలియన్ల వ్యూవ్స్ కూడా అందుకున్నాయి. ఇక ఇటీవల కోవిడ్ భారిన పడిన రాహుల్ ఎవరైనా ఆక్సిజన్ వెంటిలేటర్ తో సరైన వైద్యానికి సహకారం అందిస్తే తప్పకుండా కొలుకుంటాను. దయచేసి సహాయం చేయండి అని ఈ నెల 4వ తేదీన పోస్ట్ పెట్టాడు.

  Sushant Singh Rajput's Asthi Visarjan (Ashes Immersion) అస్థికల నిమజ్జనం in Patna, VIDEO
   పోస్ట్ చేసిన కొన్ని గంటలకే..

  పోస్ట్ చేసిన కొన్ని గంటలకే..

  ఇక శనివారం మారో పోస్ట్ చేశాడు. నా బాగోగులు చూసుకునే వారు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఏదైనా హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్ ఉంటే దయచేసి సమాచారం ఇవ్వండి. మంచి ట్రీట్మెంట్ అందితే బ్రతుకుతాను. అలా జరిగితే నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే.. అని పోస్ట్ చేసిన కొన్ని గంటలకే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సిషయాన్ని అరవింద్ గౌర్ అనే నార్త్ దర్శకుడు వివరణ ఇచ్చాడు. మరో హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడని అతను వివరణ ఇచ్చారు.

  English summary
  Actors who look so sober in front of the camera sometimes face unexpected difficulties behind the scenes. Not everyone's life is the same. No matter how much stardom you experience, sometimes life itself changes with unexpected events. And more recently a talented actor struggled until the last moment. He also begged so much on social media. But his survival did not last.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X