»   » ప్రభాస్‌కు సోనమ్ కపూర్ ఝలక్.. కలువడానికి ఇష్టపడలేదట.. ఏం జరిగిందంటే..

ప్రభాస్‌కు సోనమ్ కపూర్ ఝలక్.. కలువడానికి ఇష్టపడలేదట.. ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి విడుదలై రెండు నెలలు దాటినా సాహో హీరోయిన్‌ ఎంపిక ఇంకా సందిగ్ధత నెలకొని ఉన్నది. ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరన్నది తెలుగు డైలీ సీరియల్‌లా కథనాలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోవడంతో యంగ్ రెబల్ స్టార్ పక్కన బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిని ఎంపిక చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు తొలుత బాలీవుడ్ అందాల సుందరి సోనమ్ కపూర్‌ను అనుకొన్నారట. అయితే చివరి నిమిషంలో ఆమె నిరాకరించారనే విషయం చర్చనీయాంశమైంది.

Sonam Kapoor Wallpapers

సోనమ్ కపూర్‌తో సంప్రదింపులు

సోనమ్ కపూర్‌తో సంప్రదింపులు

చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ప్రభాస్ పక్కన సోనమ్ కపూర్‌ను తీసుకోవాలని అనుకొన్నారు. ఆమెతో దర్శక, నిర్మాతలు సంప్రదింపులు జరిపారు. కథ కూడా ఆమెకు చెప్పి స్క్రిప్టు కూడా అందజేశారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. సోనమ్, దర్శక నిర్మాతలు కలువాలనుకొన్నారు. కానీ ఎందుకో వారి మీటింగ్ వాయిదా పడింది. దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్ వాపస్ పంపడం కూడా జరిగింది అని అన్నారు.

నిర్మాతలు చొరవ తీసుకోకపోవడంతో..

నిర్మాతలు చొరవ తీసుకోకపోవడంతో..

సాహో చిత్ర యూనిట్ కనుక సరైన రీతిలో చొరవ తీసుకొని ఉంటే సోనమ్ కపూర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమై ఉండేదని, వారికి ఇతర హీరోయిన్ల ఆప్షన్లు ఎక్కువ కావడంతో సోనమ్‌ను ఓ దశలో పట్టించుకోలేదనే వాదన వినిపిస్తున్నది. అందుకే సోనమ్ వారితో భేటీ కావడానికి నిరాకరించిందనే రూమర్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రద్ధాకపూర్, దిశా భారీగా డిమాండ్

శ్రద్ధాకపూర్, దిశా భారీగా డిమాండ్

ఆ తర్వాత హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ మళ్లీ వేట మొదలుపెట్టింది. ఆషికీ2 ఫేం శ్రద్ధాకపూర్, ధోని హీరోయిన్ దిశాపటానీ, పూజా హెగ్డేలతో సంప్రదింపులు జరిపారు. శ్రద్ధా కపూర్, దిశా పటానీ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాత వెనక్కి తగ్గారని తెలిసింది. ప్రభాస్ పక్కన నటించడానికి దాదాపు రూ.8 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు వార్తలు ప్రచారమయ్యాయి.

అనుష్క వైపే దర్శక, నిర్మాతల చూపు

అనుష్క వైపే దర్శక, నిర్మాతల చూపు

ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక అంశం దేవసేన అనుష్క వద్ద ఆగిపోయిందనే వార్త వినిపిస్తున్నది. సాహో టీం అనుష్కపైనే శ్రద్ధపెట్టిందని, ఆమె కూడా ప్రభాస్ పక్కన నటించానికి సిద్ధంగా ఉందని తెలుస్తున్నది. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్‌తో పెళ్లి వార్తల జోరందుకోవడంతో అనుష్క మనస్తాపం చెందినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయడంపై అధికారికంగా ఓకే చెప్పనట్టు సమాచారం.

English summary
Prabhas’ Baahubali co-star Anushka Shetty will reunite with him for the futuristic action thriller, Saaho. However, Sonam Kapoor was the original choice for the role. Says a source, “The filmmakers gave Sonam a brief idea of the film, and she agreed to meet them. But neither did the meeting happen nor did the makers return with a bound script.” And that was that as far as the film is associated with the Kapoor girl.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu