»   » రిలీజ్ రేపే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు... మరెలా..??

రిలీజ్ రేపే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు... మరెలా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాబిల్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బలం' పేరుతో భారీ ఎత్తున విడుదల చేయనున్నసంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ సరసన యామీగౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదల అవగానే 48 గంటల్లో 25 లక్షల వీక్షకులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికి మంచి అంచనాలతోనే ఉన్న ఈ సినిమా రేపు హిందీ లోనే కాదు తెలుగు తమిళం లోనూ విడుదల అవుతోంది.

విడుదలకు మూడు నెలల ముందే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. తమిళంలోనూ ఈ చిత్రాన్ని అనువాదం చేశారు. రెండు నెలలుగా రీజనల్ లాంగ్వేజెస్‌లో పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. కానీ ఇంతా చేస్తే తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా విడుదలవుతోంది. తమిళనాడు వరకూ 120 వరకూ థియేటర్లలో విడుదల అవబోతోంది ఈ సినిమా... అయితే తెలుగులో మాత్రం దారుణమైన దెబ్బ పడింది. హృతిక్ కోసం మొత్తం హైదరాబాద్ లోనే ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా దొరకలేదట.

Not even Single theatre for Kabil Telugu Version Balam

సంక్రాంతి సినిమాల కోసమే థియేటర్లను ఉంచెసుకోవటం వల్లనో లేదంటే .. మంచు విష్ణు సినిమా 'లక్కున్నోడు' కోసం కూడా ఎక్కువ్ థియేటర్లు కేటాయించాల్సి రావటం వల్లనో కానీ.. హైదరాబాద్‌ మొత్తం లో 'బలం'కు ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లో కూడా నామమాత్రంగా విడుదల చేస్తున్నారు. 'బలం' సినిమా మీద తెలుగులోనూ కొంత వరకు పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతుండటంతో తెలుగులో చూడటానికి లోకల్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమాకు థియేటర్లే ఇవ్వలేదు. కానీ తమిళనాట మాత్రం ఈ సినిమా 120 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం.

English summary
Not even Single theatre for Kabil Telugu Subbed Version Balam in Hyderabad But in tamil version they got 120 theatre in tamilanadu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu