»   » కెరీర్ కోసం పెళ్ళి కాదనుకుంటుందా..?? పెళ్ళి ఉద్దేశం ఇప్పుడే లేదట..పాపం

కెరీర్ కోసం పెళ్ళి కాదనుకుంటుందా..?? పెళ్ళి ఉద్దేశం ఇప్పుడే లేదట..పాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్ష్మీరాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయన ఈ కన్నడ భామ మన ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. అందం, గ్లామర్‌షోకు సై అన్నప్పటికీ ఆమెకు కాలం కలసి రాలేదు.లక్ష్మీరాయ్ లేదా రాయ్ లక్ష్మీ ఇలా ఏ పేరు పెట్టుకున్న ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. ఐటం సాంగ్‌లకు వస్తున్న పేరు... సోలో హీరోయిన్‌గా సెటిల్ కాలేకపోతోంది.గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్, తర్వాత బాలీవుడ్ బోల్డ్ సినిమా జూలీ ఇలా ఎటూ పెద్ద బ్రేక్ ఇవ్వలేని ఆఫర్లే తప్ప పెద్దగా పనికి వచ్చే పాత్రలేమీ తగలటం లేదు...

లక్ష్మీరాయ్ బికినీ

లక్ష్మీరాయ్ బికినీ

2004లో విడుదలైన జూలీ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రాయ్లక్ష్మీ పది కిలోల మేర బరువు తగ్గినట్లు సమాచారం. కథానుగుణంగా లక్ష్మీరాయ్ బికినీ ధరించాల్సిరావడంతో ఆ సన్నివేశాల కోసం బొద్దుగా ఉన్న ఈ సుందరి పది కిలోల బరువు తగ్గి చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

చాలా శ్రమించాల్సివచ్చింది

చాలా శ్రమించాల్సివచ్చింది

ఇందు కోసం రెండు నెలల షూటింగ్ కి విరామం తీసుకున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో బరువు తగ్గడానికి చాలా శ్రమించాల్సివచ్చిందని, ఈ రెండు నెలలు వర్కవుట్స్తోనే సమయాన్ని గడిపానని తెలిపింది. గ్లామర్, అభినయం రెండింటి కలబోతగా తన పాత్ర సాగుతుందని, ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సివచ్చిందని చెప్పింది..

పెద్దగా ఆఫర్లేమీ రావటం లేదు

పెద్దగా ఆఫర్లేమీ రావటం లేదు

అయితే ఇంత కష్టపడుతున్నా ఈ సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లేమీ రావటం లేదు... వచ్చినా మళ్ళీ స్పెషల్ సాంగ్, బోల్డ్ క్యారెక్టర్ అంటూ అవే తరహా పాత్రలతో తప్ప మంచివేమీ లేవు. తనను తాను ప్రమోట్ చేసుకోవటం లో ఎక్కడ ఫైల్ అవుతుందో అర్థం కావటం లేదు రాయ్ లక్ష్మి.

క్యాస్టింగ్ కౌచ్ గురించి

క్యాస్టింగ్ కౌచ్ గురించి

ఆమధ్య ధోనీతో ఎఫైర్ విషయాన్ని కూడా కేవలం పబ్లిసిటీ కోసమూ, వార్తల్లో నిలిచి అందరి దృష్టీ తనవైపుకు తిప్పుకోవటం కోసమూ ఈ అమ్మడు కావాలనే తానే ఎక్కువ ప్రచారం చేసుకుందనే అపవాదు కూడా ఉంది.తాజా గా కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి టాక్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయ్యింది...

హీరోయిన్ల పట్టికలో చేరలేకపోయింది

హీరోయిన్ల పట్టికలో చేరలేకపోయింది

దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ నటించినా ఎందుకనో ప్రముఖ హీరోయిన్ల పట్టికలో చేరలేకపోయింది. అయితే కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా అందివచ్చిన ఎలాంటి పాత్రలోనైనా నటించి ఆ విధంగా పాపులర్‌ అయ్యింది. ఈ మధ్య తెలుగులో ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో చిరంజీవితో సింగిల్‌ సాంగ్‌కు చిందులేసి మంచి గుర్తింపునే తెచ్చుకుంది.

పెళ్లికి అవసరమేముందీ

పెళ్లికి అవసరమేముందీ

నటిగా 12 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్రకు రాయ్‌లక్ష్మీ బదులిస్తూ ఇప్పుడే పెళ్లి అవసరమేముందీ అంటూ ఎదురు ప్రశ్నించింది. అయినా 30 ఏళ్లు దాటిన నటీమణులు కూడా ఇంకా కథానాయికలుగా నటిస్తున్నారు. అలాంటిది తన వయసు 28దే.

కొన్నేళ్ల తరువాత పెళ్లి విషయం

కొన్నేళ్ల తరువాత పెళ్లి విషయం

ఇంకా సినిమాలో తాను చేయాల్సిన పయనం చాలా ఉంది. మరి కొన్నేళ్ల తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను అంటూ పేర్కొంది. అదీ నిజమే మూడు పదులు దాటిన ప్రౌడలు చాలా మంది పెళ్లికి దూరంగా ఉండి కథానాయికలుగా రాణిస్తూనే ఉన్నారుగా... అయితే ఇంకా సరైన బ్రేక్ రాని రాయ్ లక్ష్మీ సంగతి వేరు కదా.. ఈ వయసులో కెరీర్ అంత పెద్ద మలుపు తీసుకుంటుందా అంటే అనుమానమే మరి..

English summary
Lakshmi Rai When asked about marriage plans, Lakshmi Rai said she doesn't want to get married anytime soon. The actress in her early 30's is earlier linked to cricketer M S Dhoni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu