»   » గౌతమితో తెగదెంపులు: ఆటాడుతున్నారంటూ కమల్ హాసన్ మండిపాటు

గౌతమితో తెగదెంపులు: ఆటాడుతున్నారంటూ కమల్ హాసన్ మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గౌతమి తనతో తెగదెంపులు చేసుకున్న విషయంపై తాను ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదని తమిళ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తాను విడుదల చేసినట్లు ఓ ప్రకటన మీడియాలో రావడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. తాను విడుదల చేసినట్లు చెబుతున్న ప్రకటనను ప్రచారం చేయడం అనైతికమని అన్నారు.

దాదాపు 13 ఏళ్ల బంధాన్ని గౌతమి తెగదెంపులు చేసుకోవడంపై కమల్ హాసన్ ప్రతిస్పందించినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సమయంలో తాను ఏ విధమైన ప్రకటన కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.

Not issued any statement: Kamal Hassan on split with Gautami

తన పేరు మీద ఎవరో ప్రకటన చేసి 'ఆటలాడుతున్నార'ని ఆయన మండిపడుతున్నారు. తన పేరు మీద ప్రకటన జారీ చేసి ఆటలాడుకోవడం గౌరవప్రదమైన విషయం కాదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తమిళ భాషలో ట్వీట్ చేశారు.

తన పేరు మీద ఎవరో ప్రకటనలు ఇచ్చారని, ఇది అనైతికమని, దానిపై తాను ఏమీ వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.

English summary
Kamal Haasan has denied that he issued a statement on his split with Gautami. He has slammed a statement doing the rounds as 'unethical'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu