»   » 'శ్రీమంతుడు' ‌: 'బాహుబలి' లా జరగరాదని హైకోర్టుకి

'శ్రీమంతుడు' ‌: 'బాహుబలి' లా జరగరాదని హైకోర్టుకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్‌ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం కాపీ రైట్ కు విరుద్దం గా సినిమాకు సంభందించి ఇంటర్నెట్ లో వచ్చే దృశ్యాల్ని వెంటనే తొలిగించేలా ఇంటర్నెట్ సర్వీస్ ఫ్రొవైడర్లకు ఆదేశాలివ్వాలని గురువారం కేంద్ర ఛీప్ విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ లిలాస్ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసారు. తదుపరి విచారణను వాయిదా వేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


శ్రీమంతుడు సినిమా కాపీరైట్ హక్కుల్ని ఏ ఒక్కరూ ఉల్లంఘించకు్ండా సిటీ సివిల్ కోర్టు నుంచి ఉత్తర్వులు పొందామని, వాటిని తూచా తప్పక అమలు చేసే విషయంలో ఐఎస్ పీలకు ఆదేశాలిచ్చేలా విజిలెన్స్ అధికారులను ఆదేశించాలని కోరుతూ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ పిటీషన్ ధాఖలు చేసారు.


Not Like Baahubali... prevent Srimanthudu net piracy

పిటీషనర్ తరపు న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి, వాదనలు వినిపిస్తూ...ఇటీవల విడుదల బాహుబలి చిత్రం నిర్మాతలు సివిల్ కోర్టు నుంచి కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉత్వర్వులు పొందినా ఆ చిత్రానికి సంభందించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయని చెప్పారు. తమ చిత్రం విషయంలో అలాంటివి జరగక్కుండా చూడాలని కోరారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఆ మేరకు ఉత్వర్వులు జారీ చేసారు. మరోవైపు సివిల్ కోర్టు ఉత్తర్వులు అమలుకు చర్యలు, తీసుకోవాలంటూ ఇరు రాష్ట్రాల డీజీపీల్ని ఆదేశిస్తూ..మరో న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఉత్తర్వులు ఇచ్చాచరచు.


'రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల కాకూడదని మా సినిమాని వాయిదా వేసుకుంటున్నాం' అంటూ ఇటీవల మహేష్‌బాబు ప్రకటించారు. అనంతరం ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించి ఇవాళ శ్రీమంతుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీంతో థియేటర్ల వద్ద మహేష్‌ బాబు అభిమానులు సందడి చేశారు. పలు థియేటర్ల వద్ద అభిమానులు టికెట్ల కోసం బారులు తీరారు.


మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.


మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.


Not Like Baahubali... prevent Srimanthudu net piracy

దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,


కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Justice Vilas Afzulpurkar of the Hyderabad High Court on Thursday directed the Secretary to Ministry of Communication and Information Technology and Chief Vigilance Officers of Departments of Electronics and Information Technology and Telecommunications at Delhi to act as per the order of civil courts to ensure that the Internet Service Providers (ISPs) forthwith delete/take down/block any URLs making available any content of the Telugu movie ‘Srimanthudu’.
Please Wait while comments are loading...