»   » పాపులర్ డైరక్టర్ ఓం సాయి ప్రకాష్ ఆత్మహత్యా ప్రయత్నం..!!

పాపులర్ డైరక్టర్ ఓం సాయి ప్రకాష్ ఆత్మహత్యా ప్రయత్నం..!!

Subscribe to Filmibeat Telugu

అమ్మా నాగమ్మ, అమ్మా నాన్న కావాలి, మా ఇంటి ఆడబడుచు, అమ్మా దుర్గమ్మా, అమ్మ లేని పుట్టిల్లు వంటి చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు ఓం సాయి ప్రకాష్ ఆర్ధిక బాధలు తట్టుకోలేక నిన్న(శనివారం) ఆత్మహత్యా ప్రయత్నం చేసారు.ఆయన హోమ్ ప్రొడక్షన్ లో రూపొందించిన దేవారు కట్ట తంగి(మీరా జాస్మిన్, శివరాజ్ కుమార్) అనే కన్నడ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో తట్టుకోలేక స్లీపింగ్ పిల్స్ తెచ్చుకుని మింగారు. దాంతో ఆయన్ని కుటుంబసభ్యులు దగ్గరలోని ప్రెవేట్ హాస్పటిల్ లో చేర్పించారు. వారు ప్రకాష్ పరిస్ధితి సీరియస్ గా ఉండటంతో ఐసియు లో పెట్టారు. అయితే డేంజర్ నుండి బయిటపడినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటన చేసాయి. ఇక ఆయన ఆత్మహత్యాయత్నానికి ముందే ఈ నిర్ణయాన్ని తన సన్నిహితులుకు కొందరకు ఎస్.ఎమ్.ఎస్ లు పంపటం గమనార్హం.అలాగే సాయి ప్రకాష్ పర్శనల్ డాక్టర్ రాజు మీడియాతో మాట్లాడుతూ...ఫైనాన్సియర్స్ తమ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారని తన దగ్గర ఇంతకు ముందు వాపోయారని చెప్పారు. అయితే ఫైనాన్సియర్ త్యాగు మాత్రం తాము ఏ విధమైన హెరాస్ మెంట్ కి దిగలేదని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంపై సాయి ప్రకాష్ కి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తంగి చిత్రాలు ఇంతకు ముందు రెండు సీక్వెల్స్ తీసారు. అవి తవిరగ బా తంగి, అన్న తంగి ...ఈ రెండూ మెగా హిట్ అయ్యాయి. అన్న తంగి చిత్రాన్ని తెలుగులోనూ గోరింటాకు టైటిల్ తో రాజశేఖర్, మీనా, మీరా జాస్మిన్ తో రీమేక్ చేసారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu