»   »  ఇంతా చేస్తే అసలు ఆమె చరిత్రలో లేనే లేదట, సినిమా, దాడులు ఇంకా ఎందుకు?

ఇంతా చేస్తే అసలు ఆమె చరిత్రలో లేనే లేదట, సినిమా, దాడులు ఇంకా ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పద్మావతి'.రణ్‌వీర్ సింగ్, దీపికాపదుకొనే, షాహిద్‌కపూర్ కాంబినేషన్‌లో పద్మావతి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించనుండగా, దీపికాదుకొనే రాణి పద్మావతి పాత్రలో, షాహిద్ కపూర్ రతన్‌సింగ్ పాత్రలో నటిస్తున్నారు. దిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దిన్‌ ఖిల్జీ.. చిత్తోడ్‌ మహారాణి పద్మినిని ప్రేమించిన కథ నేపథ్యంలో భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని జైగడ్‌ కోటలో జరుగుతుండగా రాజపుత్‌ వర్గానికి చెందిన వ్యక్తులు ఆయనపై దాడి చేసారు. ఓ పక్క ప్రముఖ దర్శకుడైన భన్సాలీపై చేయిచేసుకున్నారని బాలీవుడ్‌ ప్రముఖులు ఆగ్రహానికి గురవుతుంటే మరోపక్క ప్రముఖ చరిత్రకారుడు ఎస్‌.ఇర్ఫాన్‌ హబీబ్‌ అసలు చరిత్రలో రాణి పద్మావతి పేరుతో ఏ రాణీ లేదని ఆరోపిస్తున్నారు.

Noted historian claims Rani Padmavati never existed in real

హబీబ్ మాట్లాడుతూ...1303 కాలంలో చిత్తోడ్‌ కోటలో ఖిల్జి.. తాను అద్దంలో చూసి ఇష్టపడిన రాణి పద్మావతిని వశపరుచుకోవడానికి ఆమె భర్త రాజా రావల్‌రతన్‌ సింగ్‌ కోటను స్వాధీనం చేసుకుంటాడు. అయితే రాణి పద్మావతి అసలు చరిత్రలోనే లేదని, 1540లో మాలిక్‌ మహమ్మద్‌ జాయసి అనే కవి'పద్మావత్‌' అన్న కావ్యంలో పద్మావతి అనే పాత్రని కల్పించారని హబీబ్‌ చెప్తున్నారు.

పద్మావతే కాదు 'మొఘల్‌ ఎ ఆజం'లో చూపించిన అనార్కలి అనే యువతి కూడా లేదని అది కూడా కల్పిత పాత్రేనని ఆయన ఆరోపించారు. భన్సాలీపై దాడి జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారడంతో హబీబ్‌ ట్విటర్‌ ద్వారా పద్మావతి చరిత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని జయపురలో జరుగుతున్న 'పద్మావతి' చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. చిత్ర బృందమంతా ముంబయికి తిరుగు ప్రయాణమయ్యారు. దర్శకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో చిత్రీకరణ నిలిపివేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
Noted historian S Irfan Habib claims that Rani Padmavati was not a historical figure as there is record of her before 1540. According to him, the queen was a fictional figure created in the poem, ‘Padmavat’ written by Malik Mohd Jayasi in 1540.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu