For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కోటి ఇవ్వండి : 'పీకే' కథ నాదే

  By Srikanya
  |

  ముంబై : రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రం ఘన విజయం సాధించి బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు తర్వాత రకరకాల వివాదాలతో ముందుకు వెళ్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు మరో తలనొప్పి తలకు చుట్టుకుంది. 'పీకే' సినిమాలోని కథ, సన్నివేశాలు తనవేనని, తన హిందీ నవల 'ఫరిస్తా' నుంచి వాటిని కాపీ కొట్టారంటూ కపిల్ ఇసాపురి అనే రచయిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సినిమా నిర్మాత విధువినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత జోషీలు తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపునివ్వడంతో పాటు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని తెలిపారు. క్రిందటి నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.620 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో 'ధూమ్‌3' (రూ.547 కోట్లు) అత్యధిక వసూళ్ల రికార్డు బద్దలైంది.

  Now, Aamir Khan’s ‘PK’ targeted in court, sued for Rs 1 crore

  కథ విషయానికొస్తే.... అమీర్ ఖాన్ ఆసక్తికర ఎంట్రీతో సినిమా మొదలవుతుంది. సినిమాలో సెకండ్ ఎంట్రీ ఇచ్చేది జగత్ జనని అలియాస్ జగ్గా(అనుష్క శర్మ). బెల్జియంలో ఆమె ఒక ఇండియన్ జర్నలిసమ్ స్టూడెంట్. పాకిస్థాన్ బాయ్ సర్ఫరాజ్(సుశాంత్ సింగ్ రాజ్ పుత్)తో ప్రేమలో పడుతుంది. వీరి మతాంతర ప్రేమను ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. దీంతో నిరాశకు గురైన ఆమె ఇండియా వచ్చి ఓ న్యూస్ ఛానల్ కోసం పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె విచిత్రమైన వ్యక్తి ‘పికె' తారస పడతాడు. అతని గురించి తెలుసుకునే క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇంతకీ పికె ఎవరు? అతను చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.

  ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైనా దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు. ఇక..ఈ చిత్రం ఇంత పెద్ద హిట్‌ కావటంపై చిత్ర దర్శకుడు రాజు హిరానీ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాకు కథే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హిర్వానీ, ఆమిర్‌ఖాన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్‌' సినిమా కూడా ఘనవిజయం సాధించింది.

  ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్‌ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారతీయ మతానికి సంబంధించి..హిందూదేవుళ్లపై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఆగ్రహానికి గురైన పలువురు పీకే చిత్రంపై, ఆ చిత్ర దర్శకుడిపై కేసులు నమోదు చేశారు. లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది.

  ఈ సినిమాలో కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు'' అనే డైలాగు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తమ పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  English summary
  Days after the Delhi High Court rejected a petition against Aamir Khan starrer ‘PK’, a novelist has moved a plea accusing the movie’s producers and directors of plagiarising certain portions from his Hindi book ‘Farishta’ published in 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X