»   » రామ్ చరణ్ స్మార్ట్ ఐడియాతో కొత్త రికార్డ్ (ఫన్నీ వీడియో)

రామ్ చరణ్ స్మార్ట్ ఐడియాతో కొత్త రికార్డ్ (ఫన్నీ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ మరో అడుగు ముందుకేసాడు. తన పేరు మీద అఫీషియల్ యాప్ ను లాంచ్ చేసిన తొలి సౌత్ హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఈ యాప్ ను ఆడియన్స్ కు పరిచయం చేస్తూ రూపొందించిన ఓ ఫన్నీ వీడియోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్.

My team made an interesting & a funny Video for the Application. #RcApp #RamCharan #BruceleeTheFighter #Oct16 hope you guys #LikeIt


Posted by Ram Charan on 3 October 2015

గూగుల్ ప్లేస్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా రామ్ చరణ్ లేటెస్ట్ సినిమాలకు సంబందించిన వార్తలు, ట్రైలర్స్, పోస్టర్స్, స్టిల్స్ ను అభిమానులకు అందుబాటులో ఉంచుతున్నారు.


చరణ్ కొత్త సినిమా ఇంటర్య్వూలను కూడా ఈ యాప్ ద్వారా చూసే అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న చిరు 150 సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ తన సొంతం నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ యాప్ ను రూపొందించాడు. ఈ యాప్ ద్వారా చరణ్ తమకు మరింత దగ్గరయ్యే అవకాశం ఏర్పడిందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.


Now, Catch Ram Charan On Your Smartphone

ఇక రామ్ చరణ్ 'బ్రూస్‌లీ' విశేషాలకు వస్తే..


హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు షూటింగ్ రీసెంట్ గా జరిగింది. చిత్రంలో ఆయన మూడు నిముషాలు పాటు కనిపించనున్నారు.


అలాగే..రామ్ చరణ్ అలుపెరగకుండా ఏకధాటిగా 17 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. 'బ్రూస్‌లీ'లో ఫైటర్‌గా రామ్‌చరణ్‌ ఎలాంటి పోరాటాలు చేశాడో తెలియదు కానీ అనుకొన్న సమయానికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'మెగా మీటర్‌...' అనే పాటని తెరకెక్కించారు. ఆ పాట కోసమే రామ్‌చరణ్‌ ఏకధాటిగా 17 గంటలపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది.


Now, Catch Ram Charan On Your Smartphone

ఈ పాటలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిపాడుతోంది. డ్యాన్స్‌ చేస్తూ గాయపడ్డప్పటికీ చిత్రీకరణలో పాల్గొందట రకుల్‌. 'బ్రూస్‌లీ' పాటల్ని వచ్చే నెల 2న, సినిమాని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్న చిరంజీవి త్వరలో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.


నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటల్ని వచ్చే నెల 2న, చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.


చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.


Now, Catch Ram Charan On Your Smartphone

"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan has become the first ever star to get an app on his name in the entire south India. Announcing the Ram Charan - Official App, Cherry poster on Facebook, "My team made an interesting Video for the Application.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu