Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఏకలవ్య' టైటిల్ తో రామ్ చరణ్ (పోస్టర్స్)
హైదరాబాద్: 'ఏకలవ్య' టైటిల్ తో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. అదేంటి కొత్త సినిమాకు అప్పుడే టైటిల్ పెట్టి పోస్టర్స్ వదిలారా అని..అదేమీ కాదు...రామ్ చరణ్ రీసెంట్ చిత్రం గోవిందుడు అందరివాడేలే మళయాళ వెర్షన్ విడుదల అవుతోంది. ఈ వెర్షన్ కు గానూ ఏకలవ్య అనే టైటిల్ పెట్టి పోస్టర్స్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూస్తున్నవి అవే. మళయాళంలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడ దున్నేస్తున్నాడు. రామ్ చరణ్ కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో బండ్ల గణేష్ స్వయంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
https://www.facebook.com/TeluguFilmibeat
భారీ అంచనాల నడుమ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం విడుదలైంది. కథ చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండి పాత వాసనలు కొట్టినా రామ్ చరణ్ ని కొత్తగా చూపటంలోనూ, విజువల్స్ ని అందంగా ప్రెజంట్ చేయటంలోనూ కృష్ణవంశీ సఫలీకృతుడయ్యాడంటున్నారు. టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకుంది.

ముఖ్యంగా రామ్ చరణ్ క్లైమాక్స్ లో చేసిన ఎమోషన్ సీన్ కు అందరూ ప్లాట్ అయ్యారు. రామ్ చరణ్ మేనరిజమ్స్, గెటప్, సింపుల్ గా వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాజల్ సైతం అచ్చ తెలుగు అమ్మాయిని చూసినట్లు ఫీల్ వచ్చేలా ప్రెజెంట్ చేయటం ప్లస్ అయ్యింది. రామ్ చరణ్, కాజల్ ల మధ్య వచ్చే బావా మరదళ్ల సీన్స్ బాగున్నాయి.ఇక ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపాడు. తాతయ్యగా తన వయస్సుకు మించిన పాత్రను అవలీలగా జీవించాడు.

ఇక ఈ చిత్రం కథ...
ఎన్నారై అభిరామ్(రామ్ చరణ్)కి చిన్నప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలంటే మక్కువ. తన తండ్రి ద్వారా తన కుటుంబం విడిపోయిన తీరు తెలుసుకుని, దాన్ని సరిచేసి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇండియా వస్తాడు. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్ రాజ్) అనే గ్రామ పెద్ద కి తనెవరో చెప్పకుండా ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. తన బాబాయ్ (శ్రీకాంత్) ని కలిసి అతని ప్రేమ సమస్యను తీరుస్తాడు. తన మనవడు అని తెలిసాక బాలరాజు ఎలా స్పందిచాడు. ఎలా తన కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చి కుటుంబాన్ని ఒకటి చేసాడు అనేది మిగతా కథ.