For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షారుఖ్ ఖాన్ తో మాట్లాడాలంటే ఈ నెంబర్

  By Srikanya
  |

  ముంబై :ప్రస్తుతం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమా సాధిస్తున్న రికార్డుల్ని ఆస్వాదిస్తున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులు కనపరుస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిస్పందనగా ఈ సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. భారతదేశంలో ఉంటున్న వారెవరైనా ఎస్ఎమ్ఎస్ ద్వారా ట్విట్టర్ ఇండియా లేదా జిప్ డయల్‌తో ఆయను ఫాలో కావచ్చు. 09015500555 నెంబర్‌కు డయల్ చేయడం ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మన దేశంలో మొబైల్ ఫోన్‌తో ఎవరైనా ట్విట్టర్‌పై షారూఖ్ ని ఫాలో కావచ్చు. ఇది పూర్తిగా ఉచితం కావడం గమనార్హం.

  ఏ ఫోన్ ద్వారానైనా, ఏ నెట్‌వర్క్‌నుంచైనా, ఏ సమయంలోనైనా ఎవరైనా తనను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఫాలో అయ్యే వినూత్న కార్యక్రమానికి ఆద్యుడయ్యారు షారుఖ్. షారుఖ్‌ఖాన్‌తో అభిప్రాయాల్ని పంచుకోవాలనుకుంటున్న అభిమానులు, ఆయన భావాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు... ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఆయన అందుబాటులోకి రావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  పూర్తి ఉచితంగా అందించే ఈ సేవలను ట్విట్టర్ అకౌంట్ లేకుంటే డేటా ఎనేబుల్డ్ ఫోన్ ఉన్నా లేకపోయినా, ఏ ఫోన్ ద్వారానైనా, ఏ ఆపరేటర్ నెట్‌వర్క్‌తోనైనా మొబైల్ వినియోగదారులు షారూఖ్ ఖాన్‌ను ఫాలో కావచ్చని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

  షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ " ఈ మధ్య కాలంలో నా అభిమానులకు చేరువయ్యేందుకు ట్విట్టర్ ఓ అద్భుత వేదికగా మారింది. భారతదేశంలోని నా అభిమానులంతా కూడా నాతో అనుసంధానమయ్యేందుకు ఈ నూతన సేవను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడంలో నాకు సహకరిస్తున్నందుకు అలాగే ట్విట్టర్ యాక్సెస్ లేని యావత్ జాతీయ వీక్షకులను ఒక్కచోటుకు చేర్చడంలో తోడ్పడుతున్నందుకు జిప్ డయల్, ట్విట్టర్ ఇండియాకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతి త్వరలోనే ఇది పలు దేశాలకు, భాషలకు, ప్లాట్‌ఫామ్స్‌కు చేరుకుంటుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

  ఇక షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీ సూపర్ కలెక్షన్లతో గత రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీసు రేసులో ముందుకు సాగుతోంది. పాకిస్థాన్లోనూ ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో కేవలం 8 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం ఇప్పటి వరకు 40 మిలియన్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో కలెక్షన్ల విషయానికొస్తే....విడుదలై తొలి 10 రోజుల్లో ఈచిత్రం 181.93 కోట్ల రూపయాలు వసూలే చేసింది. తొలి వారంలో దుమ్మురేపే కలెక్షన్లు సాధించి బాక్సాపీసు వద్ద నెం.1 స్థానంలో నిలిచిన ఈచిత్రం....రెండో వారంలో 'వన్స్ ఎపానె టైం ముంబై దొబారా' చిత్రం విడుదల కారణంగా 2 స్థానానికి పడిపోయింది.

  English summary
  Shah Rukh Khan announced a global integration with Twitter India and ZipDial and the collaboration will allow everyone across the country to follow and engage the superstar on Twitter via SMS. With immediate effect anyone with a mobile phone can follow Shah Rukh on his Twitter handle - iamsrk - by dialing or giving a missed call at 09015500555. The experience works for any phone and any operator network and is completely free, irrespective of whether they have a Twitter account or data-enabled phone
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X