»   » ఎన్టీఆర్ పుట్టిన రోజు.. అభిమానులకు పండగ రోజు.. డబుల్ ధమాకా ఏంటో తెలుసా!

ఎన్టీఆర్ పుట్టిన రోజు.. అభిమానులకు పండగ రోజు.. డబుల్ ధమాకా ఏంటో తెలుసా!

Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. జైలవకుశ వంటి మంచి విజయం తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో అలరించబోతున్నాడు.

ఈ నెల 20 న ఎన్టీఆర్ జన్మ దినం. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు త్రివిక్రమ్ గిఫ్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు ఎన్టీఆర్ 28 చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలువస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

NTR 28 first look will release on his birthday

ఎన్టీఆర్ పుట్టిన రోజున మరో సర్ ప్రైజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన విషయాలని రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డే రోజు అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు జరిగితే ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా పండగే.

English summary
NTR 28 first look will release on his birthday. Also interesting news from Rajamouli
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X