»   » ఈ గుర్తింపు సరిపోదు, తిట్టకూడదు...అది చేస్తే కోమాలో ఉండేవాన్నేమో: ఎన్టీఆర్

ఈ గుర్తింపు సరిపోదు, తిట్టకూడదు...అది చేస్తే కోమాలో ఉండేవాన్నేమో: ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR about Jai Lava Kusa and his Three Characters

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కువ' చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

స్మాల్ స్క్రీన్ మీద కూడా బిగ్ బాస్ ద్వారా సక్సెస్ అయ్యారు, కంగ్రాట్స్ అని యాంకర్ చెప్పగా ఎన్టీఆర్ స్పందిస్తూ.... నాకు స్మాల్ స్క్రీన్ అనడం నచ్చదు. ఎనీ స్క్రీన్ ఈజ్ స్క్రీన్. ఏదైనా వెండితెరే అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు బిగ్ బాస్.

ఈ గుర్తింపు సరిపోదు

ఈ గుర్తింపు సరిపోదు

అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కదా... అనగా ఎన్టీఆర్ స్పందిస్తూ ఈ గుర్తింపు సరిపోదు. గుర్తింపు‌కు అంతు పొంతు లేదు, సరిపోదగ, వనిషి ఆశా జీవి, ఆశ పెరుగుతూనే ఉంటుంది. అలా ఉంటేనే మనం మనుషులం అవుతామని ఎన్టీఆర్ అన్నారు.

పరుగు అనేది ఉండాలి

పరుగు అనేది ఉండాలి

రోజూ పొద్దున లేచిన తర్వాత దేనికోసమైనా పరుగు ఉండాలి. అపుడే ఏదైనా సాధించగలం. ఇదంతా నేను ప్లాన్ చేసిన పరుగు కాదు. నాకు ఇవేమీ లేకున్నా తండ్రిగా పరుగు ఉంది, భర్తగా పరుగు ఉంది, కొడుకుగా పరుగు ఉంది.... అని ఎన్టీఆర్ అన్నారు.

ఫ్యామిలీ, ఫ్యాన్స్ బాండేజ్

ఫ్యామిలీ, ఫ్యాన్స్ బాండేజ్

నాకు బేస్ మా ఫ్యామిలీ... ఫ్యామిలీ లేకుంటే నేను ఇక్కడ లేను. ఇదంతా బ్లడ్ బాండేజ్ అయితే... బ్లడ్ కాకుండా ఉండే ఫ్యాన్స్ బాండేజ్ ఒకటి ఉంది... అని ఎన్టీఆర్ తెలిపారు.

జై లవ కుశ రికార్డులు బోనస్

జై లవ కుశ రికార్డులు బోనస్

జై లవ కుశ నాకు బాగా దగ్గరైన చిత్రం, నటుడిగా బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం. ఒక్కో పాత్ర ఒక్కోరకంగా ఉంటుంది, ప్రత్యేకమైన గొంతు, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. జై లవ కుశ చూసినపుడు మంచి కథను, మంచి చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రికార్డులు అనేవి బోనస్ అని ఎన్టీఆర్ అన్నారు.

ఎవరూ తిట్టకూడదు

ఎవరూ తిట్టకూడదు

నేను కళ్యాణ్ అన్న కలిసి మంచిచిత్రం చేయాలనుకున్నాం. రేపు పొద్దున మాకు గర్వంగా ఉండాలి. ఒక మంచి ప్రయత్నం చేశాం. మంచి అంటే... రికార్డులతో, రిజల్టుతో సంబంధం లేదు. సినిమా చూస్తున్నపుడు ఎవరూ తిట్టకూడదు. ఏంటి ఇలా చేసేవు అనకూడదు. వారికి ఒక మంచి ఫీలింగ్ వస్తే చాలు. సినిమా హిట్ కాక పోయినా ట్రై చేశారు అనే మాట వచ్చినా మాకు సంతృప్తే అని ఎన్టీఆర్ అన్నారు.

ఆ ట్రిక్ ఎవరికీ తెలియదు

ఆ ట్రిక్ ఎవరికీ తెలియదు

సినిమా హిట్ చేయడం అనే ట్రిక్ ఎవరికీ తెలియదు. చీకట్లో బాణం వేయడమే. మన చేయాల్సింది మనకు వీలైనంత ఎఫర్టు పెట్టడమే... అని ఎన్టీఆర్ అన్నారు.

కోమాలో ఉండేవాన్నేమో

కోమాలో ఉండేవాన్నేమో

రాక్ష‌సత్వం, ఒంట‌రిత‌నం, మంచిత‌నం వంటి పాత్ర‌లు జై ల‌వ‌కుశ సినిమాలో క‌నిపిస్తాయ‌ని, అలాంటి పాత్ర‌ల్లో తాను న‌టించాన‌ని తెలిపాడు. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ... మ‌నిషిలోని అన్ని గుణాలు తీసుకుని చేస్తే తాను ఇప్పుడు కోమాలో ఉండేవాడినేమో అని ఎన్టీఆర్ చమత్కరించారు.

కమల్ హాసన్ హాట్సాఫ్

కమల్ హాసన్ హాట్సాఫ్

ఎన్నో పాత్ర‌ల్లో న‌టించే న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌కి హ్యాట్సాప్ చెప్పాల‌ని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. క‌మ‌ల‌్ హాస‌న్ ఓ గొప్ప‌న‌టుడ‌ని ప్రశంసించారు... ఎన్టీఆర్

మంచి నటున్నో... మహా నటున్నో మీరే చెప్పాలి

మంచి నటున్నో... మహా నటున్నో మీరే చెప్పాలి

రామ‌ల‌క్ష్మ‌ణుల‌తో పాటు రావ‌ణుడు పుట్ట‌డం అనేది ఈ నాటి రామా‌య‌ణ‌మ‌ని వ్యాఖ్యానించాడు. రామ‌ల‌క్ష్మ‌ణ‌, రావ‌ణ అనే పాత్రల‌ను స్ఫూర్తిగా తీసుకుని, మ‌నుషుల్లో ఉండే గుణాల‌ని ఈ సినిమాలో చూపించిన‌ట్లు చెప్పాడు. తానో మంచి న‌టుడిన‌ని, మ‌హా న‌టుడినో కాదో సినిమా చూసి చెప్పాల‌ని అన్నాడు, సినిమాలోని నేను మహానటుడిని అనే డైలాగ్ వెనక అర్థం ఏమిటో సినిమా చూస్తేనే అర్థమవుతుందన్నారు ఎన్టీఆర్.

జై పాత్ర కోసం కష్టపడ్డా

జై పాత్ర కోసం కష్టపడ్డా

త‌న కొత్త సినిమాలో అన్నింటికంటే ‘జై' పాత్ర కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాన‌ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నాడు. ద‌ర్శ‌కుడు బాబీ త‌న‌కు క‌థ చెప్పేట‌ప్పుడు ఆయ‌న‌ను ఓ ర‌చ‌యిత కోణంలోనే చూశాన‌ని, ఆ త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ఈ సినిమా చేయ‌గ‌ల‌డా? అన్న విష‌యాన్ని ప‌రిశీలించాన‌ని అన్నాడు.

English summary
NTR about Jai Lava Kusa movie and his three characters. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu