»   » కొరటాల వల్లే ఇలా...: ‘జనతా గ్యారేజ్’ రిజల్ట్‌పై ఎన్టీఆర్!

కొరటాల వల్లే ఇలా...: ‘జనతా గ్యారేజ్’ రిజల్ట్‌పై ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రివ్యూలు మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రాలేదు.

సినీ విమర్శకులు సినిమాలోని లోపాల్ని ఎండగట్టారు. కొరటాల శివ గత రెండు చిత్రాలను అందుకునే స్థాయిలో గానీ, మించే స్థాయిలోగానీ ఈ సినిమా లేదని తేల్చి పారేసారు. సినిమా అన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నా బలమైన కథ, నిలకడ లేని కథనం, ఆకట్టుక వల్ల 'జనతా గ్యారేజ్' అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే సినిమా జస్ట్ ఓకే, అంత గొప్పగా ఏమీ లేదంటూ తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.


Also See: ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాపై పబ్లిక్ టాక్


విమర్శకుల రివ్యూలు ఎలా ఉన్నా అభిమానులు, సాధారణ ప్రేక్షకుల నుండి మాత్రం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అంటే ప్రచారం ట్రేడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.


కాగా... సినిమా రిజల్టుపై ఎన్టీఆర్ స్పందించారు. ఆయన సినిమా రిజల్టు గురించి ఆయన ఏమన్నారు? అనేది స్లైడ్ షోలో...


జక్కన్నకు థాంక్స్

జక్కన్నకు థాంక్స్

తెల్లవారు ఝామునే జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసిన రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా పాజిటివ్ గా స్పందించారు. ఇందుకు థాంక్స్ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.


సినిమా రిజల్టుపై

సినిమా రిజల్టుపై

సినిమా గురించి అన్ని చోట్ల నుండి మంచి రిపోర్టులు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.


కొరటాల శివ వల్లే..

కొరటాల శివ వల్లే..

కొరటాల శివ కు థాంక్స్... ఆయన లేకుండా ఈ సినిమా, ఇలాంటి రిజల్ట్ సాధ్యమయ్యేది కాదు అన్నారు ఎన్టీఆర్.


ఓపెనింగ్స్

ఓపెనింగ్స్

సినిమా విడుదల ముందు నుండి మంచి హైప్ ఉండటంతో ఓపెన్సింగ్ భారీగా వస్తాయని ఆశిస్తున్నారు. రేపటి వరకు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


ఎన్టీఆర్ కెరీర్లోనే

ఎన్టీఆర్ కెరీర్లోనే

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.English summary
"Hearing good reports all over.Thanks a lot sivakoratala this wouldn't have been possible without you" NTR tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu