twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'అదుర్స్' ఆడియో రిలీజ్ విశేషాలు

    By Srikanya
    |

    ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రెడీ అయిన అదుర్స్ చిత్రం ఆడియో ఆవిష్కరణ సినీ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆడియో సీడీని బాలకృష్ణ ఆవిష్కరించి డా. దాసరి నారాయణరావుకు, క్యాసెట్‌ను డా. మోహన్‌బాబు ఆవిష్కరించి ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అందించారు.ఈ సందర్భంగా దర్శకరత్న డా.దాసరి మాట్లాడుతూ- "ఎన్టీఆర్‌, వినాయక్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'అదుర్స్‌' బాక్సాఫీస్‌ రికార్డులన్నింటిని అదరగొట్టాలి. స్టార్‌ ఇమేజ్‌ మిణుగురు పురుగులాంటిది.. అశాశ్వతమైనది. నటుడిగా వచ్చే ఖ్యాతి శాశ్వతమైంది. ఎన్టీఆర్‌ కూడా అలా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. తాత అధిరోహించిన అన్ని శిఖరాలను ఎన్టీఆర్‌ అధిరోహించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ "రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులు వచ్చారు. మీ ఆదరణవల్లే మేమీ రోజు ఇలా ఉన్నాం. మీరెక్కించే ప్రతి మెట్టుకూ సార్థకత చేకూర్చడమే మా ఆశయం. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం 'అదుర్స్‌'. తెరపై చక్కటి భావాలు పలికించేలా నటుల్ని తీర్చిదిద్దే సమర్థుడైన దర్శకుడు వినాయక్‌. మంచి సంగీతం, సాహిత్యం సమకూరింది. తారక్‌కు నాన్నగారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంద''న్నారు. అలాగే "'అదుర్స్‌' చరిత్రాత్మక విజయం సాధించాలని, ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లా ఎన్టీఆర్‌, వినాయక్‌ కాంబినేషన్‌ కూడా హ్యాట్రిక్‌ సాధించాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.

    అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ... "తారక్‌ నా బిడ్డలాంటివాడు. అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారంత స్థాయికి తారక్‌ ఎదగాలనేది నా ఆకాంక్ష' అని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ..మగధీర రికార్డులు బ్రధ్దలు కొట్టే చిత్రం అవుతందన్నారు.

    ఎన్టీఆర్‌ తనకు దేవుడిచ్చిన తమ్ముడని, ఇందులో ఉండే రెండు పాత్రల్లో ఒక పాత్ర ఎవరైనా చేయొచ్చేమోగానీ, రెండవ పాత్ర ఎన్టీఆర్‌ తప్ప తెలుగులో ఎవ్వరూ చేయలేరని, దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించారని, కొడాలి నాని, వంశీమోహన్‌ రాజీ అనే పదానికి తావివ్వకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారని వి.వి.వినాయక్‌ అన్నారు.

    ఎన్టీఆర్ మాట్లాడుతూ..."యాక్సిడెంట్‌ జరిగాక కోలుకుంటానని అనుకోలేదు. మా తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ఆశీర్వాదం, నా తల్లిదండ్రులు, మా బాబాయ్‌ బాలకృష్ణ దీవెనలు, కోట్లాదిమంది తెలుగుప్రజల అభిమానం నాకు మళ్లీ పునర్జన్మను ప్రసాదించాయి. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఇందులో చేశాను. వినయ్‌ ఈ చిత్రాన్ని సొంత డబ్బు ఖర్చుపెట్టి చేస్తే ఎంత జాగ్రత్తగా తీస్తారో, అంత జాగ్రత్తగా తీశారు. దేవిశ్రీప్రసాద్‌తో నాకిది మూడో సినిమా. చక్కని సంగీతం అందించారాయన. చోటా కె.నాయుడు నన్నెంతో అందంగా చూపించారు. నాకు రికార్డులపై వ్యామోహం లేదు. ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం' అని ఎన్టీఆర్‌ అన్నారు.

    ఇంకా ఈ సమావేశంలో అశ్వనీదత్‌, శ్రీను వైట్ల, బ్రహ్మానందం, దిల్‌ రాజు, మెహర్‌ రమేష్‌, చోటా కె.నాయుడు, గౌతంరాజు, కులశేఖర్‌, కె.ఎల్‌.నారాయణ, ఆనంద్‌సాయి, మాగంటిబాబు, భోగవల్లిప్రసాద్‌, గుణ్ణం గంగరాజు, ఎం.ఎల్‌. కుమార్‌ చౌదరి, కోనవెంకట్‌, నరేంద్రనాథ్‌చౌదరి, వంశీ పైడిపల్లి, వినాయక్‌ తండ్రి కృష్ణారావు, రామజోగయ్యశాస్త్రి, ప్రేమ్‌రక్షిత్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆదిత్య ఆడియో ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X