»   » షీలా 'ఐరన్ లెగ్' ని ఎన్టీఆర్ తుడిచేసాడా?

షీలా 'ఐరన్ లెగ్' ని ఎన్టీఆర్ తుడిచేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీతాకోక చిలుక అనే ఫ్లాప్ చిత్రంతో పరిచయమైన షీలా ఆ తర్వాత 'హలో ప్రేమిస్తారా' అంది కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆమె అల్లు అర్జున్ సరసన చేసిన 'పరుగు" పై ఆశలు పెట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గ సినిమాగా అది కలెక్షన్స్ రప్పించలేక పోయింది. ఆ తర్వాత 'మస్కా' లో కాస్త వస్త్రాలు తొలిగించి గ్లామర్ ఒలకపోసింది. ఈ సారీ ఆమెను అదృష్టం వరించక ఆమెను ఐరన్ లెగ్ అని ముద్ర వేసేసారు. అయితే తాజాగా ఆమె ఎన్టీఆర్ సరసన చేసిన 'అదుర్స్' చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు తొలి వారం రోజుల్లోనే 20 కోట్లను వసూలు చెయ్యడంతో తొలి సారిగా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు వరసగా ఆమె డేట్స్ ని నిర్మాతలు అడుగుతున్నారు. అలాగే దర్శకులు కూడా షీలాను తమ సినిమాల్లో తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఎన్టీఆర్ సరసన చేయటంతో ఐరన్ లెగ్ ముద్ర పోవటమే కాక ఆమెకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. ఇక మరో హీరోయిన్ గా చేసిన నయనతార కు మాత్రం అదుర్స్ ఏ మాత్రం ఉపయోగపడలేదంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu