»   » శాతకర్ణికి సాహో: బాలయ్య ఆదర్శం అంటూ మెగా హీరోలు, జూ ఎన్టీఆర్ ఆప్యాయత!

శాతకర్ణికి సాహో: బాలయ్య ఆదర్శం అంటూ మెగా హీరోలు, జూ ఎన్టీఆర్ ఆప్యాయత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతి బరిలో తన సత్తా చాటుతోంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే మెగా మూవీ 'ఖైదీ నెం 150' రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, ఇపుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే చరిత్రను కథాంశంగా ఎంచుకున్న ఈ సినిమాపై ఇటు సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు స్టార్లు ట్విట్టర్ ద్వారా బాలయ్యకు, చిత్ర యూనిట్ కు విషెస్ చెబుతూ ట్వీట్స్ చేసారు.

ఈ సినిమా మొదలైన దగ్గర నుండి ఎన్టీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎట్టకేలకు బాబాయ్ సినిమాపై ఎన్టీఆర్ స్పందించారు.

బాబాయ్ అంటూ ఆప్యాయంగా ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందిస్తూ.... బాబాయ్‌, గౌతమీపుత్ర శాతకర్ణి టీం మొత్తానికి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ క్రిష్. ఎన్.బి.కె 100 అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

మీరే మాకు ఆదర్శం అంటూ మెగా హీరో

గౌతమీపుత్ర శాతకర్ణి గురించి గ్రేట్ రిపోర్ట్స్ వింటున్నాను. దర్శకుడు క్రిష్, టీం మొత్తానికి కంగ్రాజ్యులేషన్స్. నందమూరి బాలకృష్ణ గారు మాలాంటి వారెందరికో మీరు ఆదర్శం అంటూ ట్వీట్ చేసారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ విష్ చేస్తూ... హ్యాపీ సంక్రాంతి, బెస్ట్ విషెస్ టు గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి అంటూ అంటూ ట్వీట్ చేసారు.

గర్వ పడేలా ఉందంటూ కళ్యాణ్ రామ్

లెజెండ్ కి ఇది ల్యాండ్ మార్క్ మూవీ. విషింగ్ బాలయ్య బాబాయ్ అండ్ టీం. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎన్.బి.కె 100 మేమంతా గర్వపడేలా ఉందని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు.

నాగార్జున కూడా

గౌతమిపుత్ర శాతకర్ణి టీంకు, బాలయ్యకు, క్రిష్ కు ఆల్ ది బెస్ట్. నాకు హిస్టారికల్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోంది అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.

సెల్యూట్ సార్ అంటూ రాజమౌళి

సాహో బసవతరకరామ పుత్ర బాలకృష్ణ. శాతకర్ణిగా మీ పెర్ఫార్మెన్స్ ఐ సెల్యూట్ సార్. నందమూరి తారకరామరావుగారు గర్వపేడేలా ఉంది అంటూ ట్వీట్ చేసారు.

English summary
Even as Balayya's landmark 100th movie Gautamiputra Satakarni is releasing in a few more hours, there was no tweet from Jr NTR till sometime ago. Finally Tarak tweeted for Babai Balayya and wished him, director Krish and the whole team of GPSK all the best.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu