»   » ఎన్టీఆర్ నువ్వు చేస్తావా అని అడగటం తో చేసేసాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ పద్మ రేఖ

ఎన్టీఆర్ నువ్వు చేస్తావా అని అడగటం తో చేసేసాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ పద్మ రేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాధాగోపాలం, రాములమ్మ తదితర సీరియల్స్, పుష్కర, టైటానిక్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన పద్మరేఖ కి తెలంగాణ శకుంతల అంత పేరుతెచ్చుకోవాలనుందట. కాకినాద దగ్గరలోని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన పద్మరేఖ ఓ పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని విశయాలని పంచుకున్నారు.

సినిమాల్లోకి తన ఎంట్రీ నే విచిత్రంగా జరిగింది. "మేజర్ చంద్రకాంత్ సినిమా లోని పుణ్యభూమి నాదేశం" పాట చిత్రీకరణ హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుండగా.. అందులో ఒక డ్యాన్సర్ సరిగా చేయకపోతే అక్కడే చిరాకు పడ్డ ఎన్టీఆర్ గారు నిలుచున్న పద్మరేఖని పిలిచి నువ్వు చేస్తావా? అన్నారట.

NTR askd me to act in Major Chandrakanth

చేస్తానని చెప్పటం తో అప్పటికప్పుడు మేకప్ వేసి కెమెరాముందుకు తీసుకు వెళ్ళారట. అలా సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. సినీ రైటర్ చంద్రబోస్ భార్య, డ్యాన్సర్ సుచిత్రమాస్టర్ దగ్గర వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకొని., విజయశాంతి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారట.

నూతన నటీనటులతో తీసిన "మజిలీ" చిత్రంలో తల్లి పాత్ర, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా "టైటానిక్- అంతర్వేది టు అమలాపురం" అనే తీసిన "థర్టీయర్స్ ఇండస్ట్రీ" పృథ్వీరాజ్ కి భార్యగా,

ఏఎన్‌ఆర్ మనుమడు సుశాంత్ హీరోగా వస్తున్న "ఆటాడుకుందాం రా!" సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం డెరైక్టర్‌ వెంటపడే పాత్ర చేస్తూనే. "పుష్కర" సినిమాలో హీరోయిన్ కాజల్‌కు తల్లిగా, భానుచందర్‌కు భార్యగా నటించారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తూన్న మరో సినిమాలో సినిమాలోని ప్రకాష్‌రాజ్ చెల్లెలుగా చేయబోతోందట.

English summary
TV serial, cinema actress dasari padma shared some memory's in a interview about her entry in tolly wood
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu