»   » బాబాయ్ సినిమాకు పేపర్లు ఎగరేసా..ఎన్టీఆర్

బాబాయ్ సినిమాకు పేపర్లు ఎగరేసా..ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో బాలయ్య బాబాయ్‌ సినిమాను జనం మధ్యలో కూర్చొని చూస్తూ పేపర్లు చింపి ఎగరేస్తూ తెగ అల్లరి చేసే వాణ్ని. అయినా ఏది ఏమైనా సినిమా చూస్తే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ లోనే చూడాలి అంటున్నాడు ఎన్టీఆర్ తన చిననాటి రోజులను తలుచుకుంటూ. ఎన్టీఆర్ హీరోగా వివి వినాయిక్ రూపొందించి 'అదుర్స్‌'చిత్రం సంక్రాంతికి రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే 'అదుర్స్‌' ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకని ఇటీవల హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ మాటల్లోనే..."ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కేవలం అభిమాన బంధంతో నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ రుణం ఏ జన్మలో తీర్చుకుంటానో? ఈ కేరింతలు కోసమే రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. 'అదుర్స్‌'తో నా ఆకలి తీరింది. ఇన్నాళ్లు ఎదురు చూసిన మీ ఆకలి కూడా తీరిందనుకుంటున్నాను. మా వినాయక్‌ అన్నతో హ్యాట్రిక్‌ కొట్టాను. ఇది..ఒక హ్యాట్రిక్‌తో ఆగదు. కనీసం పది హ్యాట్రిక్‌లైనా చేస్తామ"న్నారు. ఈ కార్యక్రమంలో వివి వినాయక్‌, వల్లభనేని వంశీమోహన్‌, కొడాలి నాని, నల్లమలుపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu