»   »  పవర్ స్టార్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ జూ ఎన్టీఆర్

పవర్ స్టార్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న‘చక్రవ్యూహ' అనే కన్నడ సినిమాలో జూ ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక ఫిబ్రవరి 12న ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లోహిత్ నిర్మాత. తెలుగు మూవీ బ్రూస్ లీలో నటించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో విల్ గా చేస్తున్నారు.

అలనాటి అగ్ర నటులు ఎన్టీఆర్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉండేది. వారిద్దరి స్నేహాబంధాన్ని వారి వారసులైన ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌లు ఇంకా కొనసాగిస్తుండటం విశేషం.

 NTR to attend Chakravyuha audio

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో' ఇటీవల విడుదలైంది. పునీత్ రాజ్ కుమార్ కు కూడా ‘చక్రవ్యూహ' 25వ చిత్రం కావడం విశేషం. తన 25వ చిత్రం స్పెషల్ గా ఉండాలని తన ప్రెండ్ అయిన ఎన్టీఆర్ తో 'చక్రవ్యూహ'లో పాట పాడించాడు పునీత్.

కన్నడ భాష అయినప్పటికీ....పాట పాడేప్పుడు ఎన్టీఆర్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదట. నిజానికి ఎన్టీఆర్‌కు కన్నడ భాషపై కూడా పట్టుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తల్లి షాలిని మాతృభాష కన్నడ. అందువల్ల ఆ భాషతో చిన్న తనం నుండే ఎన్టీఆర్‌కి పరిచయం ఉంది. ‘నాన్నకు ప్రేమతో' సినిమాలో కూడా ఎన్టీఆర్ పాట పాడిన సంగతి తెలిసిందే.

English summary
NTR has sung a song for Kannada movie Chakravyuha. The Movie is getting ready for Summer release and audio release is scheduled on February 12th. Sources informed that NTR will grace the function as chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu