»   »  ఎన్టీఆర్ అలా, బండ్ల గణేష్ ఇలా... ఎవరిని నమ్మాలి?

ఎన్టీఆర్ అలా, బండ్ల గణేష్ ఇలా... ఎవరిని నమ్మాలి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘టెంపర్' సినిమా బాక్సాసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ..ఎన్టీఆర్ కెరీర్లో మరో హిట్‌గా నమోదైన సంగతి తెలిసిందే. మరో వైపు విజయోత్సాహంలో ఉన్న హీరో ఎన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్ ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన ఓ విషయంలో ఇద్దరూ క్రెడిట్ తమదంటే తమదని చెప్పుకోవడం చర్చనీయాంశం అయింది.

ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ..... టెంపర్ టైటిల్ సాంగ్ ఫస్టాఫ్ నుండి సెకండాప్‌కు మార్చమని చెప్పింది తానే అని, సెకండాఫ్‌కు అది ప్లస్ పాయింటదని చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాత బండ్ల గణేష్ మరో ఇంటర్వ్యూలో ఆ సాంగును ఫస్టాఫ్ నుండి సెకండాఫ్‌కు మార్చమని చెప్పింది తానే అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రెడిట్ ఎవరిదో తెలియక అయోమయంలో పడ్డారు ఫ్యాన్స్. ఎవరి నిర్ణయం అయితే ఏముంది లెండి...సినిమా అయితే పెద్ద హిట్టయింది.. అది చాలు అంటూ మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నైజాం ఏరియాలో ‘టెంపర్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏకంగా రూ. 7.8 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమాలకు ప్రధాన మైన మార్కెట్ నైజాం ఏరియానే. తెలుగులో విడుదలైన ఏ సినిమా జయాపజయాలైనా నైజాం కలెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటాయి. అలాంటి కీలకమైన టెర్రిటరీలో ‘టెంపర్' మూవీ కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది.

వీకెండ్‌ తొలి మూడు రోజుల్లో రూ. 5.41 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం....ఏ మాత్రం డ్రాప్ కాకుండా సోమ, మంగళ వారాల్లో కూడా బాక్సాఫీసును దడదడలాడించింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే నాటికి ఈచిత్రం రూ. 10 కోట్ల మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు.

NTR, Bandla Ganesh Temper comments, fans confused

సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఏ రేంజిలో ఉంటుందో? ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయం కోసం చాలా కాలంగా కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అతని అభిమానులకు ఈ చిత్ర ఫలితాలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని చెప్పక తప్పదు.

ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.'

English summary
Producer Bandla Ganesh has claimed in an interview that it was his idea to put the ‘Temper’ title song in the second half. Young Tiger NTR revealed on Another Interview that he suggested the team to change the placement of ‘Temper’ title song from first half to the second half.
Please Wait while comments are loading...