»   » జై లవకుశ గురించి ఎన్టీఆర్, కుష్భూ ఎమోషనల్ ట్వీట్స్.. కుమ్మేస్తున్న కలెక్షన్లు..

జై లవకుశ గురించి ఎన్టీఆర్, కుష్భూ ఎమోషనల్ ట్వీట్స్.. కుమ్మేస్తున్న కలెక్షన్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR gets emotional of Jai Lava Kusa success : కుష్భూ ట్వీట్స్.. ఎమోషనల్ అయిన NTR

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ. తొలిసారి చేసిన తిపాత్రాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. కలెక్షన్లపరంగా కూడా జై లవకుశ చిత్రం దూసుకెళ్తున్నది. ఎంతో ఇష్టపడి చేసిన జై పాత్రకు మంచి పేరు, స్పందన రావడంపై ఎన్టీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. చిత్ర విజయానికి కారణమైన ప్రేక్షకులకు, అభిమానులకు యంగ్ టైగర్ కృతజ్ఞ‌తలు తెలిపారు. ట్విట్టర్లో యంగ్ టైగర్ ఏమన్నారంటే..

మీ ప్రేమ అద్భుతమైన

జై లవకుశ మీదు మీరు కురిపిస్తున్న మీ ప్రేమ అద్భుతమైన సంత‌ృప్తిని కలిగిస్తున్నది. నటుడిగా మిమల్ని అంతకంటే ఏమీ అడుగ గలను. జై లవకుశ టీమ్ మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నది అని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కుష్భూ జై లవకుశ గురించి

అలాగే సీనియర్ నటి కుష్భూ జై లవకుశ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఎట్టాగో చివరకు జై లవకుశ టికెట్లు లభించాయి. ఈ సినిమా చూడటంపై ఆసక్తిగా ఉన్నాను. ఈలలతో గోల చేసేందుకు సిద్ధమవుతున్నాను అని కుష్భూ ట్వీట్ చేసింది.

కలెక్షన్లపరంగా

కలెక్షన్లపరంగా

ఇదిలా ఉండగా, జై లవకుశ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల రిపోర్టులు దిమ్మతిరిగే విధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాపంగా జై లవకుశ మొదటిరోజు రూ.46.6 కోట్ల గ్రాస్, 31.12 కోట్లు నికర కలెక్షన్లు నమోదయ్యాయి.

తొలిరోజున..

తొలిరోజున..

జై లవకుశ మొదటి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 21 కోట్లు షేర్ నమోదు కాగా, కర్ణాటకలో 3.83 కోట్లు, అమెరికాలో 2.64 కోట్లు, తమిళనాడులో 40 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షలు, మిగితా దేశాల్లో 1.10 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి తొలి రోజున రూ.30.12 కోట్లు వచ్చినట్టు సమాచారం.

English summary
After success of Jai Lava Kusa, Young Tiger NTR gets emotional. He tweeted that 'All this love for Jai Lava Kusa is deeply satisfying. As an actor, can’t ask for anything better. A big thank you from team JLK to everyone'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu