»   » ఎన్టీఆర్ అభిమానులకి నిరాశ?? ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే, బాలయ్య నిర్ణయం కూడా అదే

ఎన్టీఆర్ అభిమానులకి నిరాశ?? ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే, బాలయ్య నిర్ణయం కూడా అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను తెరకెక్కించనున్నట్టు ఆమధ్య బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తాడనే టాక్ వచ్చింది. ఎన్టీ రామారావు నట జీవితాన్ని .. రాజకీయ జీవితాన్ని వేరు వేరు భాగాలుగా తెరకెక్కిస్తారని చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు పాత్రను బాలకృష్ణ చేయాలని నిర్ణయించుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకు ఎక్కిస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతోనే రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా చోటు చేసుకుంది. అసలు ఈ సమయంలో ఆయన ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించాలనే నిర్ణయానికి రావడంలోని ఆంతర్యం గురించి ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌‌గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించబోతున్నట్లు కూడా అధికారిక ప్రకటన వెలువడింది.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర

ఎన్టీఆర్ జీవిత చరిత్ర

కానీ కొంతకాలం పాటు ఈ ప్రయత్నాన్ని పక్కన పెట్టేసే ఆలోచనలో ఆయన ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇంకా బయటకు పక్కాగా రాలేదు కానీ ఇది వాస్తవం అని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. హీరో బాలకృష్ణ తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలన్న ఆలోచనను విరమించుకున్నారట.

మంచి ప్రయత్నం కాదనే

మంచి ప్రయత్నం కాదనే

ఇప్పట్లో అది మంచి ప్రయత్నం కాదని పలు వర్గాల నుంచి అందిన సూచనల మేరకు బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎన్టీ రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన మంచిదే .. అది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే ..

సన్నిహితులు చెప్పారట

సన్నిహితులు చెప్పారట

కొంతకాలం పాటు ఈ ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిదని బాలకృష్ణకి ఆయన సన్నిహితులు చెప్పారట. దాంతో ఆయన ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీస్తారని, ఒకభాగం ముఖ్యమంత్రి అయ్యే వరకు వుంటుందని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు టోటల్ గా ప్రాజెక్టునే బాలయ్య పక్కన పెట్టేసారని తెలుస్తోంది.

ప్రాజెక్టు పక్కన పెట్టేసారని వినికిడి.

ప్రాజెక్టు పక్కన పెట్టేసారని వినికిడి.

ఎన్నికలు రెండేళ్ల లోపు దూరంలో వుండగా ఇలాంటి ప్రయత్నం ఎందుకు అని అనుకున్నారో? లేదా ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని వివాదాస్పద కోణాలు కూడా టచ్ చేయాల్సి వస్తుందని అనుకున్నారో? లేదా రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడి చేతిలో ఆ సినిమా పెట్టడం ఎందుకు అని భావించారో? మొత్తం మీద ప్రాజెక్టును అయితే పక్కన పెట్టేసారని వినికిడి.

రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ

నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్ తీయనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వర్మ ఓ పాటను కూడా విడుదల చేశాడు. వర్మ చేసిన ప్రకటనలో బాలకృష్ణ హీరో అన్న మాట కానీ, నిర్మాత ఎవరన్న మాట కానీ లేదు.

విష్ణు ఇందూరి

విష్ణు ఇందూరి

అయితే, అసలు ఎన్టీయార్‌ జీవితంపై సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన ఐ.పి.ఎల్‌. తరహాలో సినిమా వాళ్ళతో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సి.సి.ఎల్‌) నడుపుతున్న విష్ణు ఇందూరిదట. ఇటీవల విదేశాల్లో సినీతారలతో ‘సైమా' అవార్డుల లాంటి ఫంక్షన్లతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిన విష్ణు ఆ ప్రతిపాదనతో బాలకృష్ణను కలిశారట.

ఇప్పట్లో చూడలేమన్న మాట

ఇప్పట్లో చూడలేమన్న మాట

ఆ ప్రాజెక్టు పని మీదే ఎన్టీయార్‌తో అనుబంధమున్న వారిని, చరిత్రకారుల్నీ బాలకృష్ణ కలుస్తూ వచ్చారు. అంత వర్క్ చేసిన తర్వాత ఆ సినిమా తీస్తే వచ్చే పరిణామాలని కూడా అంచనవేసుకున్నాకనే సినిమాని పక్కన పెట్టారని వినికిడి.... మొత్తానికి పెద్ద ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో చూడలేమన్న మాట ఆయన అభిమానులని నిరాశ పరిచేదే

English summary
Latest update from Tollywood that the project is Canceled, which is planed to direct by Ramgopal Varma a biopic on legendary actor NTR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu