»   »  విద్యాబాలన్ ఇంటికి బాలకృష్ణ.. అన్ని డౌట్లు క్లియర్!

విద్యాబాలన్ ఇంటికి బాలకృష్ణ.. అన్ని డౌట్లు క్లియర్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nandamuri Balakrishna Visits Vidyabalan Home

  తెలుగు తెరపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌కు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. విద్యాబాలన్‌ను కలువడానికి బాలకృష్ణ వెళ్లడం మీడియా వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది.

  పునరాలోచనలో విద్యాబాలన్

  పునరాలోచనలో విద్యాబాలన్

  ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు విద్యాబాలన్ పలుమార్లు పునరాలోచనలో పడ్డారట. దాంతో పాత్రపై క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా విద్యాబాలన్ ఇంటికి బాలకృష్ణ వెళ్లడం కూడా జరిగింది. తన తల్లి పాత్రకు సంబంధించిన అనేక విషయాలను విద్యాబాలన్‌కు పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం.

  విద్యాబాలన్ ఎమోషనల్

  విద్యాబాలన్ ఎమోషనల్

  తన తల్లి బాసవతారకం పాత్ర గురించి బాలకృష్ణ వెల్లడించిన విషయాలు విని విద్యాబాలన్ ఎమోషనల్ అయినట్టు తెలిసింది. దాంతో ఆ పాత్రను ఎలాగైనా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

  మరొకరు న్యాయం చేయలేరని

  మరొకరు న్యాయం చేయలేరని

  విద్యాబాలన్, బాలకృష్ణ భేటిపై బాలీవుడ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తన తల్లి పాత్రలో నటింపజేసే విషయంపై విద్యాబాలన్‌కు ఉన్న సందేహాలను తొలగించడానికి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రయత్నించారు. విద్యాబాలన్ తప్ప మరొకరు న్యాయం చేయలేరనే కారణంతో ఆమెను కలిశారు అని కథనంలో పేర్కొన్నారు.

  సెట్స్‌పైకి ఎన్టీఆర్ బయోపిక్

  సెట్స్‌పైకి ఎన్టీఆర్ బయోపిక్

  ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే ముహుర్తం షాట్‌ను పూర్తి చేసుకొన్నది. జూలై రెండోవారంలో హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకోనున్నది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు.

  తరణ్ ఆదర్శ్ ట్వీట్

  ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్‌గా ఎంపిక ఖరారైంది. ఇది అధికారికంగా వెల్లడైన వార్త. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు.

  English summary
  Vidya Balan has been approached to play a key role in Telugu biopic of actor-politician NTR. While NTR's son Balakrishna will play the role of his father, Vidya Balan was asked to play NTR's wife Basavatarakam. As Vidya Balan was taking some time to give her green signal to the offer, she had a surprise guest Balakrishna at her Mumbai residence.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more