»   » బాలయ్య సెన్సేషన్.. 62 గెటప్స్.. రంగంలోకి హలీవుడ్ టెక్నీషియన్స్

బాలయ్య సెన్సేషన్.. 62 గెటప్స్.. రంగంలోకి హలీవుడ్ టెక్నీషియన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ దూసుకెళ్తున్నాడు. పూరితో పైసా వసూల్, కేఎస్ రవికుమార్‌తో జై సింహా చిత్రాలను వేగంగా ముగించేశాడు. జై సింహ సక్సెస్ తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు. ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను బాలకృష్ణ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది అదేమిటంటే..

 సర్జరీ తర్వాత బాలకృష్ణ

సర్జరీ తర్వాత బాలకృష్ణ

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్‌లో బాలకృష్ణకు జరిగిన గాయానికి ఈ మధ్యనే భుజానికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం బాలయ్య విశ్రాంతి తీసుకొంటున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు.

NTR Biopic : Nadhiya To Play Former PM Indira Gandhi Role
 ఎన్టీఆర్ బయోపిక్‌ను..

ఎన్టీఆర్ బయోపిక్‌ను..

ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు బాలకృష్ణ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా మేకప్ బృందాన్ని హైదరాబాద్‌కు రప్పించారు. మేకప్ నిపుణులు అందించే ఎన్టీఆర్ గెటప్స్ గురించి అడిగి తెలుసుకొంటున్నారట.

 62 గెటప్స్‌లో బాలయ్య

62 గెటప్స్‌లో బాలయ్య

ఎన్టీఆయ్ బయోపిక్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు సంబంధించి దాదాపు 62 రకాలు గెటప్స్‌లో బాలయ్య కనిపిస్తాడట. ఈ చిత్రంలో బాలయ్య రావణాసురుడు, బృహన్నల, దుర్యోధనుడు లాంటి పాత్రల్లో ఆయన కనిపిస్తాడట.

 బాలయ్య వెరీ సీరియస్

బాలయ్య వెరీ సీరియస్

ఎన్టీఆర్ గెటప్స్ విషయంలో బాలయ్య చాలా సీరియస్‌గా ఉన్నాడట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో తాను కనిపించే గెటప్స్ తెలుగు ప్రేక్షకులను మైమరిపించే విధంగా ఉండాలని చిత్ర యూనిట్స్‌కు సూచించాడట.

స్వయంగా బాలయ్య నిర్మాతగా

స్వయంగా బాలయ్య నిర్మాతగా

దర్శకుడు తేజ కూడా స్క్రిప్టు విషయంలో పక్కాగా ఉంటున్నాడట. ఎన్టీఆర్ ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చిత్ర యూనిట్ చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని విష్ణు ఇందుకురి, సాయి కొర్రపాటితోపాటు బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.

English summary
NTR biopic is produced by Vishnu Indukuri, Sai Korrapati and Balakrishna under the banner Brahma Teja productions. Balakrishna to be seen in 62 different getups that senior NTR has earlier played on the screen. Teja who is the director of the film is going to rope in a special Hollywood team for styling Balakrishna in the film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X